వాట్సాప్‌ న్యూ సీక్రెట్‌ ఫీచర్‌.. ఎలా సెట్‌ చేయాలంటే? | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ న్యూ సీక్రెట్‌ ఫీచర్‌.. ఎలా సెట్‌ చేయాలంటే?

Published Fri, Dec 1 2023 5:57 PM

WhatsApp New Secret Feature For Privacy Policy - Sakshi

యాప్‌లను వాడాలంటే ప్రైవసీ ఎంతో కీలకం. యూజర్ల సమాచారానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత యాప్‌ నిర్వాహకులపై ఉంటుంది. గతంలో వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ వ్యవహారంపై తీవ్రంగా చర్చ జరిగింది. వ్యక్తిగత సమాచార గోప్యతకు భరోసా ఇస్తామని కేంద్రానికి వాట్సాప్‌ స్పష్టం చేసింది. అందులో భాగంగానే యూజ‌ర్ల ప్రైవ‌సీకి వాట్సాప్ మేజ‌ర్ అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. 

చాట్స్ కోసం వాట్సాప్ న్యూ సీక్రెట్ కోడ్ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌లో ఇప్ప‌టికే త‌మ వ్య‌క్తిగ‌త చాట్స్‌ను యూజ‌ర్లు లాక్ చేసుకునే స‌దుపాయం ఉన్నా అందులో లోటుపాట్లు ఉండ‌టంతో వాట్సప్‌ నూత‌న ఫీచర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దానివల్ల యూజ‌ర్లంద‌రి సమాచార భద్రతను అప్‌గ్రేడ్ చేసింది. న్యూ సీక్రెట్ కోడ్ ఫీచ‌ర్‌తో యూజ‌ర్లు త‌మ‌ చాట్స్‌కు వ‌ర్డ్స్‌, ఎమోజీల‌తో యూనిక్ పాస్‌వ‌ర్డ్ క్రియేట్ చేసుకోవ‌చ్చు. సెర్చ్ బార్‌లో కేవ‌లం సీక్రెట్ కోడ్‌ను టైప్ చేసి లాక్‌ అయిన చాట్‌ను యాక్సెస్ చేసేలా సెట్టింగ్స్‌ను తీసుకొచ్చారు. 

ఇదీ చదవండి: యాపిల్‌ ‌కార్డులు నిలిపివేయనున్న దిగ్గజ సంస్థ.. కారణం ఇదేనా?

వాట్సాప్‌లో చాట్ లాక్ సీక్రెట్ కోడ్ ఫీచ‌ర్‌తో  యూజ‌ర్లు యూనిక్ పాస్‌వ‌ర్డ్‌తో వారి చాట్స్‌ను ప్రొటెక్ట్ చేసుకోవ‌చ్చ‌ని మెటా కంపెనీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్ టైప్ చేసిన‌ప్పుడే లాక్డ్ చాట్స్ క‌నిపించేలా యూజ‌ర్ సెట్ చేసుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్‌తో ఏ ఒక్క‌రూ యూజ‌ర్ల ప్రైవేట్ సంభాష‌ణ‌ల‌ను గుర్తించ‌లేర‌ని వాట్సాప్ పేర్కొంది.

ఇలా సెట్‌ చేసుకోండి.. 

  • వాట్సప్‌ను ముందుగా అప్‌డేట్‌ చేసుకోవాలి.
  • లాక్డ్‌చాట్‌ విభాగానికి వెళ్లి అందులో పైన మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి.
  • అందులో ‘హైడ్‌ లాక్డ్‌ చాట్స్‌’ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
  • లాక్ చేయాల్సిన చాట్‌లకు మళ్లీ యాక్సెస్‌ చేసుకోవడానికి రహస్య కోడ్‌ని ఎంటర్‌ చేయాలి.
  • లాక్ చేసిన చాట్‌లు ప్రాథమిక చాట్ విండోలో కనిపించవు.
  • హైడ్‌ చేసిన లాక్డ్‌చాట్‌లను ఓపెన్‌ చేయడానికి రహస్య కోడ్‌ ఎంటర్‌చేసి చూడాల్సి ఉంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement