WhatsApp: యూజర్లపై విరుచుకుపడ్డ వాట్సాప్‌..!  ఏకంగా 20 లక్షల అకౌంట్స్‌ బ్యాన్‌..!

Whatsapp India Banned Over 2 Million Accounts In December 2021 - Sakshi

మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ రూల్స్‌ను ఉల్లంఘించిన యూజర్లపై విరుచుకుపడింది. ఏకంగా 20 లక్షల అకౌంట్స్‌ను బ్యాన్‌ చేసినట్లు పేర్కొంది.  

కొత్త ఐటీ చట్టాల ఉల్లంఘన..!
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలను ఉల్లంఘించిన యూజర్ల అకౌంట్స్‌ను పూర్తిగా బ్యాన్‌ చేసినట్లు వాట్సాప్‌ వెల్లడించింది. 2021 డిసెంబర్‌ నెలలో ఏకంగా 20, 79,000 బ్యాన్‌ చేసినట్లు వాట్సాప్‌ తెలిపింది. గత డిసెంబర్‌ నెలలో సుమారు 528 ఫిర్యాదుల నివేదికలను స్వీకరించి వాటిపై చర్యలు తీసుకున్నట్లుగా వాట్సాప్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.అంతకుముందు నవంబరులో 17లక్షల 59వేల అకౌంట్లను తొలగించింది. 

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా..!
వాట్సాప్‌లో యూజర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా సైంటిస్టుల సహాయంతో మరింత భద్రతను యూజర్లకు అందిస్తున్నామని వాట్సాప్‌ ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉండగా కొత్త ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా డిసెంబర్‌లో ఫేస్‌బుక్‌లో 13 కేటగిరీలలో 19.3 మిలియన్లకు పైగా చెడు కంటెంట్‌లను, ఇన్‌స్టాగ్రామ్‌లో 12 కేటగిరీలలో 2.4 మిలియన్లకు కంటెంట్‌ పోస్ట్‌లను తొలగించినట్లు మెటా సోమవారం వెల్లడించింది.

చదవండి: వాట్సాప్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..! అదే జరిగితే మీ జేబులు గుల్లే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top