వాట్సాప్‌ మరో ఫీచర్‌, పాస్‌ వర్డ్‌ మరిచిపోతే అంతే సంగతులు

Whatsapp Has A New Feature That Can Make Send Hd Photos And Store Chat - Sakshi

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. 2.21.1.5.5 ఆండ్రాయిడ్‌ యూజర్లు హెచ్‌డీ ఇమేజ్‌లను సెండ్‌ చేయడంతో పాటు, వాట్సాప్‌ చాట్‌ను స్టోర్‌ చేసుకునేలా డిజైన్‌ చేసింది.
అతి తక్కువ టైంలో మిలియన్ యుజర్లను సొంతం చేసుకున్న ఈ యాప్‌ వినియోదారులకు కోసం రోజురోజుకు ఫీచర్ అ‌ప్‌డేట్స్‌తో యూజర్లను మరింతగా ఆకర్షిస్తుంది. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది.. అయితే తాజాగా వాట్సాప్ హెచ్‌డీ ఇమేజెస్‌ సెండ్‌ చేయడంతో పాటు స్నేహితులతో చేసిన చాట్‌ను థర్డ్‌ పార్టీ యాప్స్ ద్వారా గూగుల్‌ డ్రైవ్‌ లో సేవ్‌ చేసుకునే సదుపాయం కల్పిచ్చింది.
వీ బీటా ఇన్ఫో ప్రకారం.. గతంలో మనం వాట్సాప్‌లో చేసే మెసేజెస్‌, చాట్‌ స్టోర్‌ అయ్యేది కాదు. అయితే తాజాగా వాట్సాప్‌ ఈ చాట్‌ ను స్టోర్‌ చేసేందుకు బీటా వెర్షన్‌ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ సాయంతో ఎవరైనా చాట్‌ ను గూగుల్‌ డ్రైవ్‌ లో స్టోర్‌ చేసుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది? 
వాట్సాప్‌ తెచ్చిన ఫీచర్‌ సాయంతో మీ వాట్సాప్‌ చాట్‌ ను స్టోర్‌ చేసేందుకు పాస్‌ వర్డ్‌ ను క్రియేట్‌ చేయాలి. అవసరం ఉన్నప్పుడు పాస్‌వర్డ్‌ సాయంతో స్టోర్‌ ఫోల‍్డర్‌ ఓపెన్‌ చేసి ఆ మెసేజ్‌లను చదువుకోవచ్చు. అయితే  పొరపాటున మీరు క్రియేట్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌ మరిచి పోతే స్టోర్‌ చేసుకున్న చాట్‌ ను ఓపెన్‌ చేయడం సాధ్యం కాకపోవచ్చు. 

పాస్‌వర్డ్‌ మర్చిపోతే 
స్టోర్‌ చేసుకున్న వాట్సాప్‌ చాట్‌కు పాస్‌వర్డ్‌ ఉండేలా డిజైన్‌ చేసింది. పాస్‌ వర్డ్‌ మరిచిపోతే  64 అంకెలతో వాట్సాప్‌ encrypts చేసింది. ఈ కీ  సాయంతో మీరు పాస్‌ వర్డ్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. పొరపాటున అప్‌ డేట్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌ మిస్‌ అయితే స్టోర్‌ చేసుకున్న డేటాను చూసే యాక్సెస్‌ ను మిస్‌ అవుతారు.   
 

చదవండి : కోట్ల ఆస్తిని కేవలం ఒక్కడాలర్‌కే అమ్మాడు,కారణం ఇదేనా.!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top