వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్‌! పొరపాటున పెట్టిన స్టేటస్‌లు వెంటనే డిలీట్‌ అయ్యేలా..

WhatsApp Brings Undo feature quickly delete accidentally posted status - Sakshi

ఒకరికి పంపాల్సిన మెసేజ్‌ మరొకరికి, ఒక గ్రూపులో పెట్టాల్సిన పోస్ట్‌ మరో గ్రూపులో.. వేయడం చాలామందికి జరిగేదే!.  పరధ్యానంలో, కంగారులో చేసే ఈ పొరపాటు.. ఒక్కోసారి విపరీతాలకు సైతం దారితీస్తుంటాయి. ఇదే విధంగా చాలా మంది వాట్సాప్‌లో ఏమరుపాటులో స్టేటస్‌లు కూడా అప్‌డేట్‌ చేస్తుంటారు.  అయితే ఇటువంటి సమయాల్లో పనికొచ్చే ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకురాబోతోంది. 
 

వాట్సాప్‌ ఈమధ్య మల్టీ డివైస్‌ సపోర్ట్‌, గ్రూప్స్‌ కాల్స్‌ నడుస్తుండగా..  జాయిన్‌ కాగలిగే ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  ఇప్పుడు మరో యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్‌ తీసుకొస్తోంది వాట్సాప్‌.  స్టేటస్‌ విషయంలో ‘అండూ బటన్‌’ను తేనుంది వాట్సాప్‌.  ఈ ఫీచర్‌ ద్వారా యాక్సిడెంటల్‌గా ఏదైనా స్టేటస్‌లు అప్‌డేట్‌ చేస్తే.. వెంటనే దానిని తొలగించొచ్చు. సాధారణంగా ఏదైనా వాట్సాప్‌ స్టేటస్‌ పొరపాటున పెడితే..  డిలీట్‌ చేయాలంటే కొంత టైం పడుతుంది.  స్టేటస్‌ మీద క్లిక్‌ చేసి ఆ పక్కనే వచ్చే మూడు చుక్కల మెనూ మీద క్లిక్‌ చేశాకే డిలీట్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి చేయొచ్చు. కానీ, అండూ బటన్‌ ఫీచర్‌ వల్ల ఆ టైం మరింత తగ్గిపోనుంది.
  

పొరపాటున మాత్రమే కాదు..  ఎక్కువ గ్యాలరీ కంటెంట్‌(వాట్సాప్‌ స్టోరీస్‌)తో వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టే వాళ్లకు ఈ ఆప్షన్‌ ఉపయోగపడుతుందని వాట్సాప్‌ భావిస్తోంది. ఇప్పటికే వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను టెస్టింగ్‌ చేస్తోందని, ఈ బటన్‌ మీద క్లిక్‌ చేస్తే క్షణంలో ఆ స్టేటస్‌ను తొలగించే వీలు ఉంటుందని ‘వాబేటాఇన్ఫో’ కథనం ప్రచురించింది.  తద్వారా యాక్సిడెంటల్‌గా పోస్ట్‌ చేసినా.. అవతలివాళ్లు స్క్రీన్ షాట్‌ తీసేలోపే ఆ స్టేటస్‌ను తొలగించొచ్చు. ముందు ఐవోఎస్‌ వెర్షన్‌లో ఆతర్వాతే ఆండడ్రాయిడ్‌ వెర్షన్‌కు ఈ ఫీచర్‌ను తీసుకురాబోతున్నారు.

చదవండి: నెలలో 20 లక్షల మంది వాట్సాప్‌ అకౌంట్ల బ్యాన్‌! కారణం ఏంటంటే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top