ఎలన్‌ మస్క్‌ మరో సంచలనం..! ఇక మనుషుల్ని ఆడించనున‍్నాడా?

What Is Neuralink And How Does It Work - Sakshi

ఓ వ్యక్తి కంప్యూటర్‌ ఎదురుగా కూర్చున్నాడు. లాగిన్‌ అడిగింది. వెంటనే మనసులో ఓ పాస్‌వర్డ్‌ అనుకున్నాడు. అంతే ఆటోమెటిగ్గా టైప్‌ అయిపోయి ఓపెన్‌ అయింది. జస్ట్‌ మీ కళ్లతో స్క్రీన్‌ మీద అటూ ఇటూ చూస్తుంటే..మౌస్‌ కర్సర్‌ కదులుతుంది. ఏది కావాలంటే అది ఓపెన్‌ చేస్తోంది. ఇకపై ఇలాంటి పనులు టెక్నాలజీతో జరగనున్నాయి.

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌​ స్థాపించిన 'న్యూరాలింక్‌' డెవలప్‌ చేస్తున్న'బ్రెయిన్‌ ఇంప్లాంట్‌' ప్రత్యేకత ఇది. గతేడాది టెక్నాలజీలో భాగంగా న్యూరాలింక్‌ సంస్థ కోతి మెదడులో చిప్‌ను అమర్చించింది. దాంతో ఆ కోతి 'పింగ్‌ పాంగ్‌' అనే కంప్యూటర్‌ గేమ్‌ను ఆడింది. ఇప్పుడు ఈ ఏడాది ఈ టెక్నాలజీలో మరో కీలక అడుగు పడనుంది. కొద్దిరోజుల క్రితం సీఈఓ కౌన్సిల్‌ సమ్మిట్‌లో ఎలన్‌ మస్క్‌ మాట్లాడుతూ " న్యూరాలింక్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా కోతుల్లో చిప్ లను అమర్చి అనేక పరిశోధనలు నిర్వహించాం. వాటి పనితీరు చాలా బాగుంది. అందుకే కోతుల నుంచి ఆ చిప్‌లను సురక్షితంగా తొలగించాం. ఆ పరిశోధనలు సత్ఫలితాలను అందిస్తున్నాయి.

 

న్యూరాలింక్‌ చిప్‌ వెన్నుమక సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపయోగపడుతుంది. కుర్చి, లేదంటే మంచానికే పరిమితమైన బాధితులు స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పిస్తుంది' అని ఎలన్‌ మస్క్‌ తెలిపారంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనాల్ని ప్రచురించింది. గతేడాది కోతుల్లో అమర్చిన ఆ చిప్‌ను మనుషుల్లో అమర్చుతామని ఎలన్‌ మాటిచ్చారు. కానీ కోవిడ్‌ కారణంగా సాధ్యపడలేదు. అందుకే ఈ ఏడాదిలో అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) విభాగం అనుమతిస్తే..వెంటనే మనుషుల బ్రెయిన్‌లలో ఆ చిప్‌లను అమర్చుతామని సీఈఓ సమ్మిట్‌ సందర్భంగా ఎలన్‌ తెలిపారు.

ఎలా పనిచేస్తుంది? 
'న్యూరాలింక్‌' ఇంప్లాంట్‌ పూర్తిగా వైర్‌లెస్‌ పద్ధతిలో కంప్యూటర్‌కు అనుసంధానం అవుతుంది. తల వెనుక భాగాన చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఈ ఇంప్లాంట్‌ను అమర్చుతారు. దానికి ఉండే ఎలక్ట్రోడ్లను మెదడు దిగువభాగాన నాడులకు అనుసంధానం చేస్తారు. ఈ ఇంప్లాంట్‌ ఎలక్ట్రోడ్ల ద్వారా మెదడు ఇచ్చే సంకేతాలను కాపీ చేసి.. వైర్‌లెస్‌ పద్ధతిలో కంప్యూటర్‌కు పంపుతుంది. కంప్యూటర్‌ ఆ సంకేతాలను విశ్లేషించి.. మెదడు ఇచ్చిన ఆదేశాలేమిటనేది గుర్తించి, అమలు చేస్తుంది.

చదవండి: ప్రత్యర్ధికి ఇచ్చి పడేశాడు, ఎలన్‌ మస్క్‌ అంటే కథ వేరుంటది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top