
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ఆభరణాల పరిశ్రమల మరింత పురోగమించడానికి తగిన చర్యలు లక్ష్యంగా ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ), రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది. ఒప్పందం ప్రకారం... ఈ ఏడాది రెండు భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా భారీగా మల్టీ మీడియా మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభిస్తాయి. భారత వినియోగదారుల్లో ముఖ్యంగా యువతలో పసిడి ఆభరణాల, నాణ్యత, ధరల విధానం విషయంలో అవగాహన పెంచడం దీని లక్ష్యం. యల్లో మెటల్ భవిష్యత్ సంపదగా ఎలా ఉంటుందన్న అంశాన్ని మహిళల్లో అవగాహన కల్పిస్తారు.