రూ.4000 తగ్గిన రేటు.. బంగారం ధరలు ఇలా..! | Weekly Gold Price Update Significant Decline Across Hyderabad Chennai Delhi and More | Sakshi
Sakshi News home page

రూ.4000 తగ్గిన రేటు.. బంగారం ధరలు ఇలా..!

Jun 6 2026 8:34 PM | Updated on Jun 7 2026 12:58 PM

Weekly Gold Price Update Significant Decline Across Hyderabad Chennai Delhi and More

పెరిగిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుముఖం పట్టాయి. వారం రోజులుగా (మే 31 నుంచి జూన్ 6) పతనమవుతూనే ఉన్నాయి. దీంతో రేటు గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో ధరలు ఎంతలా తగ్గాయి?, అనే వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో మే 31(ఆదివారం)న 1,57,040 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు జూన్ 6 (శనివారం) నాటికి 1,52,730 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.4,310 తగ్గిందన్నమాట. 22 క్యారెట్ల రేటు 1,43,950 రూపాయల నుంచి 1,40,000 రూపాయల (రూ.3,950 తగ్గింది) వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి.

చెన్నైలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర వారం రోజుల్లో.. 1,59,600 రూపాయల వద్ద నుంచి రూ.4,690 తగ్గి 1,54,910 రూపాయాల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,46,300 రూపాయల నుంచి 1,42,000 రూపాయల (రూ.4,300 తగ్గింది) వద్దకు చేరింది.

ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. మే 31న రూ.1,57,190 వద్ద ఉన్న తులం పసిడి ధర జూన్ 6 నాటికి రూ.1,55,910 వద్దకు (రూ.1,280 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర 1,44,100 రూపాయల నుంచి 14,0150 రూపాయల (రూ.3,950 తగ్గింది) వద్దకు చేరింది. మొత్తం మీద జూన్ నెల ప్రారంభం నుంచి గోల్డ్ రేటు తగ్గుతూనే ముందుకు సాగుతోంది.

ఇదీ చదవండి: ఏఐ దాహం.. ప్రపంచానికి కొత్త సవాల్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement