ఎలన్‌ మస్క్‌కు ట్విటర్‌ ఊహించని షాక్‌!

waiting period for Elon Musk deal has expired says Twitter - Sakshi

టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌కు ట్విటర్‌ భారీ షాకిచ్చింది. హార్ట్ స్కాట్ రోడినో యాంటీట్రస్ట్ ఇంప్రూవ్‌మెంట్స్ యాక్ట్ ప్రకారం 44 బిలియన్‌ డాలర్లకు తమ సంస్థను కొనుగోలో చేసేందుకు ఇచ్చిన సమయం ముగిసిందని తెలిపింది. ఇప్పుడు తాము చెప్పినట్లే మస్క్‌ తమ సంస్థను కోనుగోలు చేయోచ్చని స్పష్టం చేసింది.   

ట్విటర్‌ విధించిన షరతులకు లోబడి మస్క్‌ కొనుగోలును పూర్తి చేయాలి. ఈ కొనుగోలు జరగాలంటే ట్విటర్‌ స్టాక్‌హోల్డర్ల ఆమోదం తప్పని సరిగా ఉండాలని, అందుకు వర్తించే రెగ్యులేటరీ ఆమోదాలు ఉన్నాయని చెప్పింది. హెచ్‌ఎస్‌ చట్టం నిబంధనలకు మేరకు భారీ లావాదేవీలపై ఫెడరల్ ట్రేడ్ కమీషన్, యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ యాంటీట్రస్ట్ డివిజన్లు రివ్యూ చేయాలి. అనంతరం రివ్యూ ఆదారంకు మస్క్‌..ట్విటర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

తాత్కాలికంగా హోల్డ్‌లో
సుమారు 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌-ఎలన్‌ మస్క్‌ మధ్య కొనుగోలు ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలో పూర్తిగా ఎలన్‌ మస్క్‌ చేతికి ట్విటర్‌ వెళ్లాల్సి ఉంది. కానీ ఫేక్‌ అకౌంట్‌ల గురించి సంబధిత సమాచారం ఇవ్వాలని మస్క్‌ డిమాండ్‌ చేశారు. మస్క్‌ అభ్యర్ధను ట్విటర్‌ తిర్కరించింది. దీంతో ట్విటర్‌ డీల్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచినట్లు మస్క్‌ ప్రకటించారు. కాగా,ఈక్విటీ ఫైనాన్సింగ్ ద్వారా 33.5 బిలియన్లు, రుణాల ద్వారా 13 బిలియన్లను పొందారు. ఆ సమయంలో ట్విటర్‌ షేర్‌ వ్యాల్యూ దాదాపు 2శాతం పెరిగి 40.62 డాలర్లకు చేరింది.

చదవండి👉ట్విటర్‌ డీల్‌ తాత్కాలికంగా నిలిపివేత.. ఎలన్‌ మస్క్‌ ప్రకటన, కారణం ఇదే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top