కొరియన్‌ కంపెనీలతో వేదాంత గ్రూప్‌ ఒప్పందం

Vedanta Tie Up With 20 Korean Companies For Electronics Manufacturing Hub In India - Sakshi

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా గ్రూప్‌ తాజాగా 20 కొరియన్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. డిస్‌ప్లే గ్లాస్‌ తయారీ పరిశ్రమకు మద్దతుగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వేదాంతా పేర్కొంది.

తద్వారా దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీ కేంద్రం అభివృద్ధికి తెరతీయనున్నట్లు తెలియజేసింది. కొరియా ప్రభుత్వ నిధులతో అక్కడ ఇటీవల ఏర్పాటైన 2023 కొరియా వాణిజ్య షోకు వేదాంతా హాజరైంది. వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ కోట్రా ఏర్పాటు చేసిన ట్రేడ్‌ షోలో భాగంగా కొరియన్‌ డిస్‌ప్లే గ్లాస్‌ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నట్లు వేదాంతా సెమీకండక్టర్‌ విభాగం గ్లోబల్‌ ఎండీ ఆకర్ష్‌ కె.హెబ్బర్‌ తెలియజేశారు. 

50 కంపెనీలకుపైగా తమతో భాగస్వామ్యానికి ఆసక్తి చూపినట్లు వెల్లడించారు. ఇవి ఎలక్ట్రానిక్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ వేల్యూ చైన్‌కు ఉపకరించనున్నట్లు వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top