వ్యాక్సిన్‌ హోప్‌- యూఎస్‌ దూకుడు

Vaccine hopes- S&P, Nasdaq hits record highs again - Sakshi

డోజోన్స్‌ హైజంప్‌- రికార్డ్‌ గరిష్టానికి చేరువ 

ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌- సరికొత్త రికార్డులు

  తొలిసారి 12,000 మార్క్‌ దాటిన నాస్‌డాక్‌

మళ్లీ 29,000 ఎగువన నిలిచిన డోజోన్స్‌

వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న అమెరికా స్టాక్‌ మార్కెట్లు బుధవారం మరోసారి దూకుడు చూపాయి. వ్యాక్సిన్ల అందుబాటు కారణంగా డిసెంబర్‌కల్లా కోవిడ్‌-19కు చెక్‌పెట్టగలమంటూ వెలువడిన అంచనాలు సెంటిమెంటుకు జోష్‌నివ్వగా.. మరో సహాయక ప్యాకేజీపై స్పీకర్‌ నాన్సీ పెలోసీతో ఆర్థిక మంత్రి స్టీవెన్‌ ముచిన్‌ చర్చలు ప్రారంభించడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఎస్‌అండ్‌పీ  54 పాయింట్లు(1.5%) బలపడి 3,581కు చేరగా.. నాస్‌డాక్‌ 117 పాయింట్లు(1%) ఎగసి 12,056 వద్ద ముగిసింది. వెరసి 2020లో ఇప్పటివరకూ ఎస్‌అండ్‌పీ 22వసారి, నాస్‌డాక్‌ 43వ సారి సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఇక డోజోన్స్‌ 455 పాయింట్లు(1.6%) జంప్‌చేసి 29,100 వద్ద స్థిరపడింది. తద్వారా ఫిబ్రవరి గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడంతోపాటు.. 6 నెలల తదుపరి తిరిగి 29,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది.

బ్లూచిప్స్‌ దన్ను
ప్రధానంగా దిగ్గజ కంపెనీలు బలపడటంతో మార్కెట్లు జోరందుకున్నాయి. కోక కోలా, జనరల్‌ మోటార్స్‌, హెచ్‌పీ 4 శాతం, ఇంటెల్‌ కార్ప్‌, ఫేస్‌బుక్‌ 2.5 శాతం, మైక్రోసాఫ్ట్‌ 2 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఏడీపీ 3 శాతం, ఫోర్డ్‌ మోటార్‌, బోయింగ్‌ 1.75 శాతం, అమెజాన్‌ 1 శాతం చొప్పున ఎగశాయి. బాస్కెట్‌ బాల్‌ దిగ్గజం మైఖేల్‌ జోర్డాన్‌ను సలహాదారుగా నియమించుకోవడంతో డ్రాఫ్ట్‌కింగ్స్‌ 8 శాతం దూసుకెళ్లింది. కంపెనీలో అతిపెద్ద ఇన్వెస్టర్‌ ఒకరు షేర్లను విక్రయించినట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్‌ 6 శాతం పతనమైంది. ఇక బుధవారం భారీగా ఎగసిన జూమ్‌ వీడియో 7.5 శాతం దిగజారగా.. యాపిల్ ఇంక్‌ 2 శాతం క్షీణించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top