న్యూఢిల్లీ: దేశీ ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) తాజాగా కాంబోడియాలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ సంస్థ కాంబోడియాకి చెందిన ఎక్లెడా బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.
దీని ప్రకారం తొలి దశలో ఆ దేశంలో 45 లక్షల వ్యాపారులకు భారతీయ పర్యాటకులు క్యూఆర్ ఆధారంగా చెల్లింపులు చే యొచ్చు. తదుపరి దశలో కాంబోడియా పర్యాటకులు భారత్‌లో కూడా ఈ విధానంలో చెల్లింపులు జరిపే వెసులుబాటును వినియోగంలోకి తెస్తారు. ప్రస్తుతం సింగపూర్, ఫ్రాన్స్, నేపాల్ తదితర 8 దేశాల్లో యూపీఐకి అందుబాటులో ఉంది.


