Joker Malware: స్మార్ట్‌ఫోన్లపై మరోసారి దాడి

Updated Joker Malware Floods Into Android Apps In Google Play Store - Sakshi

'పెగసెస్‌' ప్రకంపనలు ప్రపంచదేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మంటలు చల్లారక ముందే ఇప్పుడు 'జోకర్‌' మాల్వేర్‌ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జోకర్‌ ఇటీవల కాలంలో బాగా పాపులర్‌ అయిన మాల్వేర్‌. మనకు తెలిసిన జోకర్‌ నవ్విస్తే..ఈ జోకర్‌ మాత్రం ఫోన్లలో చొరబడి ఏడిపిస్తుంది. 2017లో తొలిసారిగా గూగుల్‌ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇదే మాల్వేర్‌ ఎప‍్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ.. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని దెబ్బకు ఇటీవల కాలంలో ప్లేస్టోర్‌ నుంచి 1800యాప్‌ లను గూగుల్‌ తొలగించింది. 

ఈ ఏడాది జూన్‌ నెలలో జోకర్‌ దెబ్బకు స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. మాల్వేర్‌ దాడి జరిగిందనే అనుమానంతో పది యాప్ లను తొలగించారు. తాజాగా ఈ మాల్వేర్‌ కెమెరా, ఫొటో, ట్రాన్సలేషన్‌ యాప్స్‌, ఎడిటింగ్ తో పాటు ప్రాసెసింగ్, మెసెంజర్, గేమింగ్ యాప్ లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్లు తేలింది. వాటి సాయంతో ఒకరి ఫోన్‌లోనుంచి మరొకరి ఫోన్లలోకి ప్రవేశిస్తోందని తేలింది. దీని ప్రభావం ఒక్క గూగుల్‌ ప్లేస్టోర్‌ లోనే కాకుండా ఇతర థర్డ్ పార్టీ యాప్‌ లపై దాడి చేస్తున్నట్లు ఇంక్రీన్స్‌ సీఈఓ నయ్యర్‌ తెలిపారు. ​

డాక్టర్‌ వెబర్‌ వివరాల ప్రకారం... తొలిసారి ఈ మాల‍్వేర్‌ను ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే  కు చెందిన యాప్‌ గ్యాలరీలో గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యాప్‌ గ్యాలరీ సాయంతో ప్రమాదకరమైన మాల్వేర్‌ ను పంపిస్తుంది. ఇలా సుమారు 538,000 మంది వినియోగదారుల ఫోన్లలోకి చొరబడినట్లు సమాచారం. 

చదవండి: భారత్‌ ఎకానమీ చెక్కు చెదర్లేదు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top