breaking news
jokers
-
జోకర్‌తో నవ్వాలనుకుంటే అది ఏడిపిస్తోంది
'పెగసెస్' ప్రకంపనలు ప్రపంచదేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మంటలు చల్లారక ముందే ఇప్పుడు 'జోకర్' మాల్వేర్ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జోకర్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన మాల్వేర్. మనకు తెలిసిన జోకర్ నవ్విస్తే..ఈ జోకర్ మాత్రం ఫోన్లలో చొరబడి ఏడిపిస్తుంది. 2017లో తొలిసారిగా గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇదే మాల్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని దెబ్బకు ఇటీవల కాలంలో ప్లేస్టోర్ నుంచి 1800యాప్ లను గూగుల్ తొలగించింది. ఈ ఏడాది జూన్ నెలలో జోకర్ దెబ్బకు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. మాల్వేర్ దాడి జరిగిందనే అనుమానంతో పది యాప్ లను తొలగించారు. తాజాగా ఈ మాల్వేర్ కెమెరా, ఫొటో, ట్రాన్సలేషన్ యాప్స్, ఎడిటింగ్ తో పాటు ప్రాసెసింగ్, మెసెంజర్, గేమింగ్ యాప్ లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్లు తేలింది. వాటి సాయంతో ఒకరి ఫోన్లోనుంచి మరొకరి ఫోన్లలోకి ప్రవేశిస్తోందని తేలింది. దీని ప్రభావం ఒక్క గూగుల్ ప్లేస్టోర్ లోనే కాకుండా ఇతర థర్డ్ పార్టీ యాప్ లపై దాడి చేస్తున్నట్లు ఇంక్రీన్స్ సీఈఓ నయ్యర్ తెలిపారు. డాక్టర్ వెబర్ వివరాల ప్రకారం... తొలిసారి ఈ మాల్వేర్ను ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే కు చెందిన యాప్ గ్యాలరీలో గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యాప్ గ్యాలరీ సాయంతో ప్రమాదకరమైన మాల్వేర్ ను పంపిస్తుంది. ఇలా సుమారు 538,000 మంది వినియోగదారుల ఫోన్లలోకి చొరబడినట్లు సమాచారం. చదవండి: భారత్ ఎకానమీ చెక్కు చెదర్లేదు -
కేసీఆర్ ఓ మాయల ఫకీరు: ఎర్రబెల్లి
మానకొండూర్: సీఎం కేసీఆర్ ఓ మాయల ఫకీరని, ఆయన మాటలు తుపాకీరాముడి మాటలను తలపిస్తున్నాయని, ఆయనది తుగ్లక్ పాలన అని టీడీప శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ సర్కారు విద్యుత్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నాయన్న టీఆర్ఎస్ నేతల ఆరోపణలు అవాస్తమవన్నారు. ఈ విషయాన్ని అఖిలపక్షం సమావేశంలో నిరూపిస్తే రాజీనామాకైనా సిద్ధమని సవాల్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు కేసీఆర్ లేఖ రాస్తే తెలంగాణ కు కరెంటు తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ మొద్దునిద్ర కారణంగా తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. కొందరు లఫూట్‌గాళ్లు మాత్రమే టీఆర్ఎస్లో చేరుతున్నారని, అసలైన కార్యకర్తలు టీడీపీలోనే ఉన్నారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, రానున్న రోజుల్లో భారీ కుంభకోణాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడైనా పర్యటించేందుకు చంద్రబాబుకు హక్కు ఉందన్నారు. ఆయన పర్యటనను అడ్డుకుంటామనడం మూర్ఖత్వమన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం, మంత్రులు కనీసం స్పందించడం లేదన్నారు. సమావేశంలో టీటీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సిహెచ్. విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు.