
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో.. సైబర్ నేరగాళ్లు ఎక్కువవుతున్నారు. మొబైల్స్ హ్యాక్ చేసి డబ్బు దోచేస్తున్నారు. ఫోన్‌లో మాల్‌వేర్స్ ఉపయోగించి కొందరు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయవచ్చు. అయితే మీ ఫోన్‌లో మాల్‌వేర్స్ ఉన్నాయా?, లేదా? అని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూసేద్దాం..
కంటిన్యూస్ పాప్ అప్ యాడ్స్: మీరు ఉపయోగించే ఫోన్‌లో మాల్‌వేర్స్ ఉంటే.. పాప్ అప్ యాడ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి యాడ్స్ మీద క్లిక్ చేస్తే.. డబ్బు పోగొట్టుకోవడం ఖాయం. కొన్ని ప్రమాదకర యాప్‌ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం కూడా లీక్ చేస్తాయి.
బ్యాటరీ ఛార్జ్ త్వరగా అయిపోతుంది: మీ ఫోన్‌లో మాల్‌వేర్స్ ఉంటే.. బ్యాటరీ ఛార్జ్ కూడా త్వరగా అయిపోతుంది. దీనికి కారణం మీకు తెలియకుండా మీ ఫోన్‌ను (బ్యాక్‌గ్రౌండ్) ఇతరులు హ్యాండిల్ చేతుంటారన్న మాట. దీంతో ఛార్జింగ్ కూడా వేగంగా తగ్గిపోతుంది.
ఫోన్ స్పీడ్ తగ్గుతుంది: మాల్‌వేర్స్ కారణంగా ఫోన్ వేగం తగ్గుతుంది. దీంతో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా మొబైల్ సహకరించదు. కొన్నిసార్లు యాప్‌లు కూడా మాల్‌వేర్స్ కారణంగా క్రాష్ కావచ్చు.
ఇదీ చదవండి: పేటీఎం యూపీఐ ఆగిపోతుందా?: గూగుల్ ప్లే అలర్ట్‌పై కంపెనీ రెస్పాన్స్
ఫోన్ వేడెక్కుతోంది: మాల్‌వేర్స్ మీ ఫోన్‌లో ఉన్నట్లయితే.. మొబైల్ చాలా వేడెక్కుతుంది. కొన్నిసార్లు ఇంటర్నల్ సీపీయూపై ఎక్కువ లోడ్ పెంచుతుంది. లోపి అనే మాల్‌వేర్స్ ఫోన్‌ను వేడెక్కేలా చేస్తుంది. కాబట్టి ఏమీ చేయకుండానే ఫోన్ వేడెక్కుతుంటే.. కొంత సమయం పాటు దాన్ని ఆఫ్ చేయడం మంచిది.
మాల్‌వేర్‌ను ఎలా తొలగించాలి?
ఫోన్ నుంచి మాల్‌వేర్‌ను తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి సేఫ్ మోడ్‌ను ప్రారంభించడం. ఆండ్రాయిడ్ ఫోన్‌లో సేఫ్ మోడ్‌ను ప్రారంభించడం ద్వారా, ఇది థర్డ్ పార్టీ యాప్‌లను నిలిపివేస్తుంది. దీనితో పాటు యాంటీ వైరస్ సహాయంతో ఫోన్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా మాల్‌వేర్‌ను గుర్తించవచ్చు. ఇవన్నీ పనిచేయకపోతే.. ఫోన్‌ను రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేయడానికి ముందు.. మీకు అవసరమైన డేటాను బ్యాకప్ తీసుకోవడం మర్చిపోవద్దు.