ఈ యాప్స్ ను వెంటనే డిలీట్ చేయండి

Uninstall These Apps From Your Phone - Sakshi

మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారా, పదే పదే ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా. అయితే, మీరు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకోండి. కొన్ని యాప్స్ మీ ఫోన్‌లో ఉన్న బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఆధార్, పాన్ నెంబర్స్ ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును ఖాళీ చేసే అవకాశం ఉన్నట్లు బీజీఆర్ తన రిపోర్ట్ లో వెల్లడించింది. ఆ నివేదికలో కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ వివరాలు బహిర్గతం చేసింది. వీటి వల్ల సైబర్ క్రైమ్‌లు జరిగే ఆస్కారం ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. మీ ఫోన్‌లో కనుక ఈ కింద తెలిపిన యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

  • కేక్ వీపీఎన్ (Cake VPN) 
  • పసిఫిక్ వీపీఎన్ (Pacific VPN) 
  • ఈవీపీఎన్ (eVPN) 
  • బీట్‌ప్లేయర్ (BeatPlayer)
  • క్యూర్/బార్‌కోడ్ స్కానర్ మ్యాక్స్ (QR/Barcode Scanner MAX)
  • మ్యూజిక్ ప్లేయర్ (Music Player)
  • టూల్‌‌టిప్‌నేటర్‌లైబ్రరీ (tooltipnatorlibrary)
  • క్యూరికార్డర్ (QRecorder)
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top