Twitter : ఫేక్‌ ఖాతాలపై కొరడా

Twitter Said That Some inauthentic Accounts Verified By Mistakenly - Sakshi

గతంలో తమ వల్ల పొరపాటు జరిగిందంటూ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ ఒప్పుకుంది. ఇకపై అలాంటి తప్పులకు  తావివ్వబోమంటూ యూజర్లకు హామీ ఇచ్చింది. ఇకపై మరింత నాణ్యతతో  సేవలు అందిస్తామని పేర్కొంది. 

ఫేక్‌ అకౌంట్లు
మైక్రో బ్లాగింగ్‌ సోషల్‌ మీడియాగా సంచలనం సృష్టించిన ట్విట్టర్‌ గతంలో ఫేక్‌ ఖాతాలను వడబోసేది. అయితే ఈ వడపోత కార్యక్రమంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ట్విట్టర్‌ 2017 నుంచి ఈ పని నిలిపేసింది. అయితే అప్పటికే అనేక ఫేక్‌ అకౌంట్లు ట్విట్టర్‌లో ఉండిపోయాయి. వీటి వల్ల యూజర్లు కూడా ఇబ్బందులు పడ్డారు.

తప్పు జరిగింది
దాదాపు నాలుగేళ్ల తర్వాత 2021 మే నుంచి మరోసారి వెరిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ చేపట్టింది ట్విట్టర్‌. ఈ సందర్భంగా ట్విట​‍్టర్‌ ప్రతినిధులు స్పందిస్తూ ... గతంలో పొరపాటుగా కొన్ని ఫేక్‌ అకౌంట్లకు తాము అనుమతి ఇచ్చామని, వెరిఫికేషన్‌లో జరిగిన తప్పులే ఇందుకు కారణమని తెలిపారు. ఇకపై ఫేక్‌ అకౌంట్లకు ఎట్టి పరిస్థితుల్లో వెరిపై చేసి బ్లూ టిక్‌ ఇచ్చే ప్రశ్నే లేదని తెలిపారు.

ఇవి నిబంధనలు
మానిప్యులేషన్‌, స్పామ్‌ పాలసీ ప్రకారం ఫేక్‌ అకౌంటర్లను శాశ్వతంగా తొలగిస్తున్నామని, అదే విధంగా వాటికి జారీ చేసిన వెరిఫైడ్‌ బ్యాడ్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ట్విట్టర్‌. ఫేక్‌ ఖాతా కాదు అనేందుకు ట్విట్టర్‌ జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం గత ఆరు నెలలుగా ఖాతా ఉపయోగంలో ఉండాలి. దీంతో పాటు ఖాతాకు సంబంధించిన ఈమెయిల్‌, ఫోన్‌ నంబరు వివరాలు జత చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్‌ నేమ్‌, ఇమేజ్‌లు కూడా ఉండాలి. అదే విధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా యాక్టివిటీస్‌ ఉండాలి. ఈ నియమాలు పాటించే ఖాతా దారులకు వెరిఫైడ్‌ బ్యాడ్జీని జారీ చేస్తుంది ట్విట్టర్‌. లేని పక్షంలో ఫేక్‌గా గుర్తించి ఖతాలు స్తంభింప చేస్తుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top