మొదటిసారి ఈ-రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌ - టీవీఎస్‌ మోటార్స్‌ | Sakshi
Sakshi News home page

మొదటిసారి ఈ-రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌ - టీవీఎస్‌ మోటార్స్‌

Published Fri, Sep 22 2023 7:02 AM

TVS Motors E Racing Championship - Sakshi

బెంగళూరు: టీవీఎస్‌ మోటార్స్‌ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన రేసింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు(టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ వన్‌ మేకింగ్‌ చాంపియన్‌షిప్‌) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రిక్‌ టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఈ రేస్‌ మోటార్‌సైకిళ్లతో ఈ పోటీలు జరగనున్నాయి. 

ఈవీ మోటార్‌ రేసింగ్‌ ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశించిన మొట్ట మొదటి భారత కంపెనీ తమదేనని టీవీఎస్‌ మోటార్స్‌ తెలిపింది. భారత్‌లో మోటార్‌స్పోర్ట్స్‌లను ప్రోత్సహించడం, సుస్థిర రవాణా పరిష్కారాలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement