గుడ్ న్యూస్: టీవీఎస్ అపాచీ బైక్ పై భారీ ఆఫర్

TVS Apache RTR 200 4V available with savings of up to Rs 10000 - Sakshi

మీరు కొత్తగా బైక్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ తన అపాచీ ఆర్టీఆర్ 200 4వి బైక్ పై భారీ ఆఫర్ ప్రకటించింది. టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన అపాచీ ఆర్టీఆర్ 200 4విని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే రూ.5,000 క్యాష్‌బ్యాక్‌తో అందిస్తుంది. అదేవిధంగా ఈ బైక్‌ను ఫైనాన్స్ స్కీమ్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు రూ.10 వేల వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ 2021 జూన్ 30 వరకు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ మోటారుసైకిల్ విభాగంలో రెండు వేరియంట్లు అమ్మకానికి ఉన్నాయి. రైడ్ మోడ్‌లతో సింగిల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్, డ్రైవింగ్ మోడ్‌లతో డ్యుయల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్. 

సింగిల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్ మోటార్ సైకిళ్ ధర ఉంటే,1.29 లక్షలు, డ్యుయల్-ఛానల్ ఎబిఎస్ వేరియంట్ ధర రూ.1.34 లక్షలు(ఎక్స్ షో-రూమ్)గా ఉంది. ఇందులో 8,500 ఆర్‌పీఎమ్ వద్ద 20.54 హెచ్‌పీ, 7,000 ఆర్‌పీఎమ్ వద్ద 18.1 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే 198 సీసీ ఫోర్-వాల్వ్, ఆయిల్-కూల్డ్ సీంగిల్ సీలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ కలిగి ఉంది. డ్రైవింగ్ మోడ్‌ను బట్టి పవర్ అవుట్‌పుట్ మారుతుంది. ఈ బైక్ గరిష్ఠ వేగం వచ్చేసీ గంటకు 127 కి.మీ. టీవీఎస్ భారతదేశంలో టీవీఎస్ ఎన్‌టోర్క్ 125 స్కూటర్ కోసం కొత్తగా “నో-కాస్ట్” ఈఎంఐ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కస్టమర్ క్రెడిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్ లావాదేవీ చేస్తే మాత్రమే ఆఫర్ చెల్లుతుంది.

చదవండి: ఖాతాదారులకు ఎస్‌బీఐ అలర్ట్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top