మెగా డీల్‌ : అంబానీ సరసన అదానీ

Total to acquire 20pc stake in Adani Green Energy - Sakshi

అంబానీ సరసన అదానీ,  భారీ

అదానీ  గ్రీన్‌ వాటాలను విదేశీ కంపెనీకి విక్రయం

అదానీలోకి ఫ్రాన్స్ కంపెనీ  టోటల్ ఎంట్రీ 

20శాతం వాటా కొనుగోలు

సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ దిగ్గజ కంపెనీలకు వాటాను విక్రయిస్తూ, మెగాడీల్స్‌తో జోరుమీదున్న బడా వ్యాపారవేత్తల జాబితాలో తాజాగా బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ  చేరారు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఎల్)లో మైనారిటీ వాటాను ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్‌ఈకి విక్రయించనుంది. ఈ డీల్‌ విలువ 2.5 బిలియన్‌ డాలర్ల (రూ.18,200 కోట్లు) గా ఉండనుంది. ఈ ఒప్పందం ద్వారా  సమకూరిన నిధులతో అదానీ  తన వ్యాపార రుణాన్ని తగ్గించుకోనుందని అంచనా.

అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ గ్రీన్‌లో 20శాతం వాటా కొనేందుకు ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అలాగే సోలార్‌ ఎనర్జీ అభివృద్ధిలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఉన్న అదానీ గ్రీన్‌ బోర్డులోకి టోటల్‌  చేరనుంది. మొత్తం 2.35 గిగావాట్స్‌ సోలార్‌ అసెట్ లో 50 శాతం వాటా అదానీ సొంతం. కంపెనీలో ప్రమోటర్లకు 74.92 శాతం వాటా ఉండగా, దీనిలో 20 శాతం వాటాను టోటల్‌కు విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్లకు చెందిన 16.4 శాతం వాటాకు సమానమైన 25.65 కోట్ల షేర్లను టోటల్‌ కొనుగోలు చేసినట్లు అదానీ గ్రీన్‌ వెల్లడించింది. పునరుత్పాదక , సహజ వాయువు అనే రెండు స్తంభాల ఆధారంగా శక్తి పరివర్తన వ్యూహాన్ని అమలు చేయడానికి భారతదేశం సరియైనదని తాము భావిస్తున్నామని  టోటల్ సీఈఓ పాట్రిక్ పౌయన్నే ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా 1988లో వస్తువుల వ్యాపారిగా ప్రారంభమైన అదానీ గ్రూప్, భారతదేశపు అగ్రశ్రేణి ప్రైవేటు రంగ పోర్ట్ ఆపరేటర్ విద్యుత్ జనరేటర్‌గా ఎదిగింది. 2019  ఏడాదిలో విమానాశ్రయాలపై దృష్టి పెట్టిన, అదానీ  తాజాగా డాటా  స్టోరేజ్‌,  ఆర్థిక సేవలు సహా  ఇతర రంగాలలోకి ఎంట్రీ ఇస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 1.483 ట్రిలియన్ డాలర్లు (20.25 బిలియన్ డాలర్లు). 20 శాతం వాటా ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 4.1 బిలియన్ డాలర్లు. మరోవైపు తన వ్యాపార స్రామాజ్యంలో వాటాలను విదేశీ దిగ్గజాలకు అమ్మడం ద్వారా పెట్టుబడులను సేకరిస్తూ  రిలయన్స్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ విశషంగా నిలిచారు. ఫేస్‌బుక్‌, గూగుల్‌, సిల్వర్‌లేక్‌, అబుదాబి సహా వివిధ విదేశీ పెట్టుబడిదారుల నుంచి  సుమారు 27 బిలియన్ల డాలర్లను సంపాదించిన సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top