ఆన్‌లైన్‌లో వ‌స్తువులు కొని మోసపోయారా? అయితే వెంట‌నే ఇలా చేయండి?

Tips For Avoiding Online Shopping Scams And What To Do If You A Victim Of One - Sakshi

కోవిడ్ కార‌ణంగా ఆన్‌లైన్ వినియోగం పెరిగిపోయింది. మ‌న‌కు కావాల్సిన నిత్యవ‌స‌ర స‌రుకుల నుంచి గాడ్జెట్స్ వ‌ర‌కు అన్నీ ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తుంటాం. అయితే ఆన్‌లైన్ వినియోగం పెర‌గ‌డంతో మోసాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఫోన్ బుక్ చేస్తే ఇటుక బిళ్ల‌, స‌బ్బులు, శానిటైజ‌ర్ డ‌బ్బాలు రావ‌డం మ‌నం గ‌మ‌నిస్తుంటాం. ఇలాంటి స‌మయాల్లో మీరు మోస‌పోయార‌ని గుర్తిస్తే ఫిర్యాదు చేసుకోవ‌చ్చు. మీకు త‌ప్ప‌క న్యాయం జ‌రుగుతుంది. వీటితో పాటు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. 

అమెజాన్‌లో మీరు ప్రొడ‌క్ట్ బుక్ చేస్తే అది ఆ సంస్థ‌ది కాద‌ని గుర్తించాలి. అమెజాన్‌లో కోట్లాది మంది సెల్ల‌ర్స్ ఉంటారు. వాళ్ల వ‌స్తువుల్ని అమ్మేందుకు మ‌ధ్య వ‌ర్తిగా ఈకామ‌ర్స్ ఫ్లాట్‌ఫామ్స్ అమెజాన్‌, ఫ్లిప్ కార్ట్‌లు ఉంటాయి.   

ఇక ఈ - కామ‌ర్స్ సంస్థ‌ల‌కు చెందిన వ‌స్తువులైతే ప్రొడ‌క్ట్ ప‌క్క‌న ఉదాహ‌ర‌ణ‌కు అమెజాన్ ఫుల్ ఫిల్‌, ఫ్లిప్ కార్ట్ ఎస్యూర్డ్ పేర్లు ఉంటాయి. వాటిని గుర్తించుకోవాలి. 

ప్రొడ‌క్ట్ కొనేముందుకు క్యాష్ ఆన్ డెలివ‌రీ పెట్టుకోవాలి

మీకు డెలివ‌రీ వ‌చ్చిన ప్రొడ‌క్ట్‌ను ఓపెన్ చేసే ముందు నుంచి వీడియో తీసి పెట్టుకుంటే మీకు ఒక ప్రూఫ్‌గా ఉంటుంది

ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఒక్కోసారి మీరు ఆర్డ‌ర్ పెట్టిన ప్రొడ‌క్ట్ మీకు వ‌చ్చినా..ఆ ప్రొడ‌క్ట్ ప‌నిచేయ‌క‌పోవ‌డం,డ్యామేజ్ అవ్వ‌డంలాంటివి జ‌రుగుతుంటాయి.

అలా జ‌రిగితే ఈ - కామ‌ర్స్ ప్లాట్ ఫామ్‌లోని కొంత‌మంది సెల్ల‌ర్స్ మ‌న‌కు డ‌బ్బుల్నిరిట‌న్ చేయ‌డం లేదంటే మీకు కావాల్సిన ఐట‌మ్ వారం రోజుల్లో రిప్లెస్ చేసి పంపిస్తారు. కొంత మంది పంపించ‌రు. అలాంటి స‌మ‌యాల్లో తిరిగి  మీకు కావాల్సిన ప్రొడ‌క్ట్ లేదంటే డ‌బ్బులు తిరిగి పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.   

ఈకామ‌ర్స్ కంపెనీలు అమెజాన్‌, ఫ్లిప్ కార్ట్ క‌స్ట‌మ‌ర్ కేర్‌కి కాల్ చేస్తే మీ స‌మ‌స్యకు ప‌రిష్కారం దొరుకుతుంది. 

మీకు క‌స్ట‌మ‌ర్ కేర్‌కి కాల్ చేసినా ప‌ట్టించుకోలేదంటే..మీ వైపు క‌రెక్ట్‌గా ఉంటే రిపోర్ట్ చేయోచ్చు.

మీ ప్రొడ‌క్ట్ డ్యామేజ్ అయినా లేదంటే మీరు తీసుకునే  ప్రొడ‌క్ట్ గురించి వెబ్ సైట్‌లో ఒక‌లా మీకు డెలివ‌రీ అయిన త‌రువాత మ‌రోలా ఉంటే క‌న్జ్యూమ‌ర్ కోర్ట్‌లో ఫిర్యాదు చేయోచ్చు. 

క‌న్జ్యూమ‌ర్ ప్రొట‌స్ట్ యాక్ట్ -2019కింద కంప్లెయింట్ చేయోచ్చు.సెక్ష‌న్-2 లో 10,11,16,28 సెక్ష‌న్‌లు ఉంటాయి. ఆ సెక్ష‌న్‌ల‌లో మీరు ఏ సెక్ష‌న్ బాధితులో తెలుసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఫుడ్ డెలివ‌రీ, బ్యాంక్ ట్రాన్స‌క్ష‌న్‌, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఇలాంటి వాటిల్లో మీరు మోస‌పోతే ఫిర్యాదు చేసుకోవ‌చ్చు. 

https://consumerhelpline.gov.in/.లో లేదంటే టోల్ ఫ్రీ నెంబ‌ర్ .1800-11-4000,14404కి ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 5.30 లోపు ఫోన్ చేయోచ్చు.

ఎస్ఎంఎస్ అయితే 8130009809కి చేయోచ్చు. ఎన్‌సీహెచ్,యూఎంఏఎన్‌జీ యాప్‌లో కంప్లెయింట్ చేయోచ్చు. ఇలా డైర‌క్ట్‌గా ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేయోచ్చు. ఇలా చేస్తే మీ న్యాయం జ‌రుగుతుంది. అలా జ‌ర‌గ‌క‌పోతే ప్రైవేట్ సంస్థ‌ల్ని సంప్ర‌దించొచ్చు.  

వాటిలో https://icrpc.org/,https://voxya.com/,https://www.onlinelegalindia.com/కి ఫిర్యాదు చేయోచ్చు. వీళ్లు మాత్రం ఫిర్యాదును బ‌ట్టి కంప్లెయింట్ తీసుకుంటారు. 

పై వాటితో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా కోర్ట్‌లో ఫిర్యాదు చేయాలంటే ఆన్‌లైన్‌లో https://edaakhil.nic.in/index.html లో కంప్లెయింట్‌, అడ్వికేట్ సెక్ష‌న్‌లో రిజిస్ట‌రై ఫిర్యాదు చేయోచ్చు. కాక‌పోతే ఇక్క‌డ మీరు కంప్లెయింట్‌కు ముందుగా ఓ లాయ‌ర్‌ను నియ‌మించుకోవాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top