‘జెఫ్‌ బెజోస్‌ మారువేశంలో ఉన్న సూపర్‌ విలన్‌’

Thousands Sign Petition To Not Allow Jeff Bezos Re Entry To Earth - Sakshi

వాషింగ్టన్‌: అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తన తొలి అంతరిక్షయాత్ర కోసం సిద్ధమైన విషయం తెలిసిందే. బ్లూ ఆరిజిన్‌ కంపెనీ తన తొలి మానవసహిత అంతరిక్షయాత్రను జూలై 20న ప్రయోగించనుంది. ఈ ప్రయోగంలో జెఫ్‌ బెజోస్‌ తన సోదరుడితో న్యూషెపార్డ్‌ అంతరిక్షనౌకతో కలిసి ప్రయాణించనున్నాడు. వీరితో పాటుగా సుమారు రూ. 280 కోట్ల మేర బిడ్‌ చేసిన వ్యక్తి ఈ యాత్రలో పాలుపంచుకోనున్నాడు. జెఫ్‌ బెజోస్‌ తన తొలి అంతరిక్షయాత్ర కోసం సన్నాద్దమౌతుంటే కొంతమంది నెటిజన్లు అతనిపై విరుచుకుపడుతున్నారు.

బెజోస్‌ను తిరిగి భూమిపైకి రానివ్వదంటూ ఆన్‌లైన్‌లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జెఫ్‌ బెజోస్‌ మారువేశంలో ఉన్న సూపర్‌ విలన్‌ అని, అతడు ప్రపంచాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే సరైనా అవకాశం జెఫ్‌ బెజోస్‌ను తిరిగి భూమిపైకి రానివ్వకుండా ఉంటే మానవాళి పెనుముప్పునుంచి తప్పించుకోవచ్చునని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌కు సుమారు వారం వ్యవధిలో 6781 మం‍ది మద్దతు తెలిపారు.

చదవండి: జెఫ్‌ బెజోస్‌ కీలక నిర్ణయం..! ఏకంగా తన సోదరుడితో కలిసి..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top