5 డోర్ల థార్‌ ‘రాక్స్‌’ | Test drives of the Thar Roxx will start on September 14 | Sakshi
Sakshi News home page

5 డోర్ల థార్‌ ‘రాక్స్‌’

Aug 16 2024 6:25 AM | Updated on Aug 16 2024 7:58 AM

Test drives of the Thar Roxx will start on September 14

ప్రారంభ ధర  రూ.12.99 లక్షలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ (ఎస్‌యూవీ) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహీంద్రా అయిదు డోర్ల థార్‌ రాక్స్‌ భారత్‌లో ఎంట్రీ ఇచి్చంది. ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.12.99 లక్షలు. సెప్టెంబర్‌ 14 నుంచి టెస్ట్‌ డ్రైవ్‌ కోసం రాక్స్‌ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్‌ 3 నుంచి బుకింగ్స్‌ ప్రారంభం. దసరా నుంచి డెలివరీలు ఉంటాయి. 

2 లీటర్‌ ఎం–స్టాలియన్‌ టీజీడీఐ పెట్రోల్‌ ఇంజన్, 2.2 లీటర్‌ ఎం–హాక్‌ డీజిల్‌ ఇంజన్‌ ఆప్షన్స్‌లో ఆరు వేరియంట్లలో రేర్‌ వీల్‌ డ్రైవ్, 4 వీల్‌ డ్రైవ్‌ డ్రైవ్‌ట్రెయిన్‌తో లభిస్తుంది. 6 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఎంచుకోవచ్చు. 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్‌ సన్‌రూఫ్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, కీ లెస్‌ ఎంట్రీ, పుష్‌ బటన్‌ స్టార్ట్, 644 లీటర్స్‌ బూట్‌ స్పేస్‌ వంటి హంగులు ఉన్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement