Good News: కోటికి పైగా ఉద్యోగాలు..ఇక మీదే ఆలస్యం..!

Tech Workforce Increase 9 To 10 Million Says Nandan Nilekani - Sakshi

ఐటీ ఉద్యోగం సంపాదిచడం మీ లక్ష్యమా? అయితే మీకో శుభవార‍్త. రాబోయే మరికొన్ని సంవత్సరాల్లో దేశీయ ఐటీ ఉద్యోగాల డిమాండ్‌  4.5 మిలియన్ల నుంచి 9 -10 మిలియన్ల చేరుతుందని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నందన్‌ నిలేకని అసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

శుక్రవారం స్వచ్ఛంద సంస్థ 'అసెంట్‌ ఈ -కాంక్లేవ్' 6వ ఎడిషన్‌లో నందన్‌ నిలేకని పాల్గొన్నారు. ఈ సందర్భంగా "అడాప్టివ్ అడ్వాంటేజ్" అనే అంశంపై ప్రసంగించారు. దేశంలో పెరిగిపోతున్న డిజిటల్‌ సేవల వినియోగం, పెరుగుతున్న యునికార్న్‌ సంస్థలు (100కోట్ల వ్యాల్యూ), దిగ్గజ ఐటీ సంస్థలు భారీ ఎత్తున లాభాల్ని గడిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వర్క్‌ ఫోర్స్‌ డిమాండ్‌ 4.5 మిలియన్ల నుంచి 9-10 మిలియన్లకు చేరుకుంటుందని అన్నారు.

కరోనా కారణంగా టెక్నాలజీ రంగం అభివృద్ది చెందిందని, దీంతో ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. అదే సమయంలో ఆల్రెడీ జాబ్‌ చేస్తున్నా లేదంటే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇదొక మంచి అవకాశమని అన్నారు. విద్యా అర్హత, ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఏ టెక్నాలజీ మీద ఎక్కువ డిమాండ్‌ ఉందో తెలుసుకొని ఆ దిశగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించడం మంచిదని పలువురు ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

ముఖ్యంగా సెప్టెంబర్ త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్‌తో సహా నాలుగు ప్రధాన ఐటి సంస్థలు డిజిటల్ ఎక్స్‌పర్ట్స్‌ కోసం పెద్దపీఠ వేడయంతో అట్రిషన్ రేట్లు పెరిగాయని నివేదించాయి. మరోవైపు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్‌ఎర్త్‌ ఇన్‌సైట్ ప్రకారం ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2022లో వరకు దాదాపు 2.5 లక్షల మంది కాలేజీ గ్రాడ్యుయేట్‌లతో ఫ్రెషర్‌లను నియమించుకునేందుకు ఐటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలిపింది.

చదవండి: ఒక్క జాబ్‌కే 5 మంది పోటీ పడుతున్నారు..ఈ రంగాల్లోనే

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top