క్యూ2లో రూ. 13,884 కోట్లు
టర్నోవర్ రూ. 73,188 కోట్లు
ఆర్డర్లు@ 9.6 బిలియన్ డాలర్లు
ఏఐ ఆదాయం 3 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్స ల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. తద్వారా టాటా గ్రూప్ ఐటీ దిగ్గజం క్యూ2(జూలై–సెపె్టంబర్) ఫలితాల సీజన్‌కు తెరతీసింది. వార్షికంగా క్యూ2లో నికర లాభం 15 శాతం వృద్ధితో రూ. 13,884 కోట్లను తాకింది. గతేడాది(2025–26) ఇదే కాలంలో రూ. 123,075 కోట్లు ఆర్జించింది. త్రైమాసికవారీగా అంటే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో సాధించిన రూ. 13,349 కోట్లతో పోలిస్తే లాభం దాదాపు 4% పెరిగింది.
షేరుకి రూ. 12 డివిడెండ్
వాటాదారులకు టీసీఎస్ బోర్డు తాజాగా షేరుకి రూ. 12 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 14 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. క్యూ2లో టీసీఎస్ ఆదాయం 11 శాతంపైగా పుంజుకుని రూ. 73,188 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో రూ. 65,799 కోట్ల ఆదాయం అందుకోగా.. ఈ ఏడాది క్యూ1లో రూ. 72,275 కోట్ల టర్నోవర్ సాధించింది. వెరసి త్రైమాసికవారీగా ఆదాయంలో నామమాత్ర పురోగతి నమోదైంది. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విభాగం ఆదాయం 3 బిలియన్ డాలర్లను తాకినట్లు కంపెనీ సీవోవో ఆర్తి సుబ్రమణ్యన్ వెల్లడించారు. ఈ ఏడాది క్యూ1లో ఇది 2.6 బిలియన్ డాలర్లుకాగా.. క్యూ2లో మొత్తం 9.6 బిలియన్ డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులు పొందినట్లు కంపెనీ వెల్లడించింది. క్యూ1లో 9.5 బిలియన్ డాలర్ల ఆర్డర్లు అందుకున్న సంగతి తెలిసిందే.
ఇతర విశేషాలు
→ క్యూ2లో 4,258 మంది ఉద్యోగులను జత చేసుకుంది.
→ దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 5,98,056కు చేరింది.
→ ఉద్యోగ వలస(అట్రిషన్) 13.3 శాతంగా నమోదైంది.
→ పన్నుకు ముందు లాభాల మార్జిన్ 24% గా నమోదైంది.
→ ఎనర్జీ, రిసోర్సెస్, యుటిలిటీస్ బిజినెస్‌లు వార్షికంగా 5.7 శాతం వృద్ధి అందుకున్నాయి.
→ ఇది అన్ని విభాగాలలోకెల్లా అత్యధికంకాగా.. కన్జూమర్ బిజినెస్ 1 శాతం క్షీణించింది.
→ ఉత్తర అమెరికా నుంచి ఆదాయం 1.5% పుంజుకుంది.
→ భారత్‌లో అత్యంత వేగవంత వృద్ధి(6%) సాధించింది.
→ మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు బీఎస్‌ఈలో 0.4 శాతం తగ్గి రూ. 2,075 వద్ద ముగిసింది.
అన్నిటా వృద్ధి..
అన్ని అంతర్జాతీయ మార్కెట్లు, అత్యధిక పారిశ్రామిక విభాగాలలో పురోభివృద్ధి సాధించాం. ఈ త్రై మాసికంలో 2 ప్రత్యేక డీల్స్ కుదుర్చుకున్నాం. త ద్వారా పోర్షే, బెస్ట్ బయ్‌తో కొత్త విభాగాల ట్రాన్స్‌ఫార్మేషన్ భాగస్వామ్యాలకు తెరతీశాం. క్లయింట్లతో కలసి రిపీటబుల్ వేల్యూ ప్లాట్‌ఫామ్స్‌ను నిర్మిస్తున్నాం. దీంతో ఏఐను భారీస్థాయిలో పారిశ్రామికీకరించేందుకు వీలుంటుంది.
– కె.కృతివాసన్, సీఈవో, టీసీఎస్


