టాటా స్టీల్‌ రూ. 2,502 కోట్ల నష్టాలు | Tata Steel Q3 Results: Reports Rs 2502 Crore Net Loss | Sakshi
Sakshi News home page

టాటా స్టీల్‌ రూ. 2,502 కోట్ల నష్టాలు

Feb 7 2023 5:10 AM | Updated on Feb 7 2023 5:10 AM

Tata Steel Q3 Results: Reports Rs 2502 Crore Net Loss - Sakshi

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకంగా రూ. 2,502 కోట్ల నష్టాన్ని (కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన) ప్రకటించింది. వ్యయాలు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ రూ. 9,598 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇక తాజాగా ఆదాయం రూ. 60,843 కోట్ల నుంచి రూ. 57,354 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 48,666 కోట్ల నుంచి రూ. 57,172 కోట్లకు పెరిగాయి.

కంపెనీ రుణ భారం ప్రస్తుతం రూ. 71,706 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో రూ. 3,632 కోట్ల మొత్తాన్ని కంపెనీ పెట్టుబడి వ్యయాలపై వెచ్చించింది. ఉక్కుఉత్పత్తి 7.76 మిలియన్‌ టన్నుల (ఎంటీ) నుంచి 7.56 ఎంటీకి తగ్గింది. ఒడిదుడుకుల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా అమ్మకాల్లో స్థిర వృద్ధి సాధించగలిగామని టాటా స్టీల్‌ సీఈవో టీవీ నరేంద్రన్‌ తెలిపారు. వ్యయాల నియంత్రణ, నిర్వహణను మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టుకోనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement