టాటా మోటార్స్‌ నష్టాలు, షేర్లు ఢమాల్‌!

Tata Motors tanks 5 pc post Q2 results - Sakshi

 క్యూ2లో రూ. 945 కోట్లకు పరిమితం 

జేఎల్‌ఆర్‌ ఆదాయం 36 శాతం ప్లస్‌  

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆటో మేజర్ స్ట్రీట్ నిరాశపరచడంతో గురువారం  ట్రేడింగ్‌లో టాటా మోటార్స్  షేర్‌  5 శాతం కుప్పకూలింది. జాగ్వార్ ల్యాండ్ ఓవర్ (జేఎల్‌ఆర్‌) అమ్మకాలు ఆశ్చర్యపరిచినా,  దేశీయ లాభాలు ఈ అంచనాలను అందుకోలేక  మార్కెట్‌ను నిరాశపరిచాయి.  ఫలితాల నేపథ్యంలో బుధవారం స్వల్ప నష్టాలతో రూ. 433 వద్ద ముగిసింది.

కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్‌(క్యూ2)లో నికర నష్టాలు భారీగా తగ్గి రూ.945 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఏకంగా రూ. 4,442 కోట్ల నష్టం వచ్చింది. ఆదాయం సైతం రూ. 62,246 కోట్ల నుంచి రూ. 80,650 కోట్లకు జంప్‌చేసింది. ఇక  స్టాండెలోన్‌ నికర నష్టాలు సైతం రూ. 659 కోట్ల నుంచి తగ్గి రూ. 293 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం ఆదాయం రూ. 11,197 కోట్ల నుంచి రూ. 15,142 కోట్లకు ఎగసింది.  

జేఎల్‌ఆర్‌ జూమ్‌ 
ప్రస్తుత సమీక్షా కాలంలో బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) ఆదాయం 36శాతం జంప్‌చేసి 5.3 బిలియన్‌ పౌండ్లను తాకింది. దేశీయంగా టాటా మోటార్స్‌ వాణిజ్య వాహన అమ్మకాలు 19శాతం వృద్ధితో 93,651 యూనిట్లను తాకగా.. ఎగుమతులు 22శాతం పుంజుకుని 6,771 వాహనాలకు చేరినట్లు కంపెనీ ఈడీ గిరీష్‌ వాగ్‌ పేర్కొన్నారు.  ఈ కాలంలో 69శాతం అధికంగా 1,42,755 ప్యాసింజర్‌ వాహనాలు విక్ర యించింది. ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో 326శాతం వృద్ధితో 11,522 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top