TATA Nexon : గుడ్‌న్యూస్‌.. నెక్సాన్‌ రేంజ్‌ పెరిగింది! మార్కెట్‌లోకి ఎప్పుడంటే?

Tata Motors Focused On Its Nexon Range Issue - Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో ఎంతో ఆసక్తి రేపి ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకున్న నెక్సాన్‌ మోడల్‌కి సంబంధించి టాటా తీపి కబురు రాబోతుంది. ఈ మోడల్‌కి ఇబ్బందిగా మారిన సింగిల్‌ ఛార్జ్‌లో ప్రయాణించే దూరం విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.  

రేంజ్‌
దేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్‌లో టాటా నెక్సాన్‌దే అగ్రస్థానం. దాదాపు 60 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. అయితే నెక్సాస్‌  సింగిల్‌ ఛార్జ్‌లో ప్రయాణించే దూరం తక్కువగా ఉండటం వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ కారు 180 నుంచి 200 కిలోమీటర్ల వరకే ప్రయాణిస్తుంది. ఈ కారుతో సిటీలో రోజువారి పెద్దగా ఇబ్బంది లేకపోయినా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే కష్టంగా మారింది.

ఎప్పుడు రావొచ్చు
వినియోగదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బ్యాటరీ సామర్థ్యం పెంచాలని టాటా నిర్ణయించింది. ప్రస్తుతం టాటా నెక్సాన్‌లో 30.2 కిలోవాట్ల బ్యాటరీని 40 కిలోవాట్లకు పెంచాలని నిర్ణయించారు. దీంతో కనీసం ప్రయాణ రేంజ్‌ కనీసం 30 శాతం పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. ఈ మార్పులు చేసిన కొత్త కారు 2022 ద్వితియార్థంలో మార్కెట్లోకి రావచ్చని అంచనా

పెరిగే రేంజ్‌ ఎంత
బ్యాటరీ సామర్థ్యం పెంచిన తర్వాత టాటా మోటార్స్‌ చేపట్టిన ఇంటర్నల్‌ టెస్ట్‌లో కారు సింగిల్‌ రేంజ్‌ కెపాసిటీ 400 కిలోమీటర్ల వరకు ఉన్నట్టు అంచనా. అయితే రియల్‌టైంలో ఆన్‌రోడ్‌  కనీసం 300 కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వరకు రావచ్చని తెలుస్తోంది.

గట్టి పోటీ
హ్యుందాయ్‌ నుంచి కోనా ఎంజీ నుంచి జెడ్‌ఎస్‌ మోడళ్ల నుంచి టాటా నెక్సాన్‌కి గట్టి పోటీ ఎదురవుతోంది. మొత్తంగా కారు ధర పరంగా చూస్తే నెక్సాన్‌ తక్కువకే లభిస్తున్నా.. ప్రయాణ రేంజ్‌ తక్కువగా ఉండటం మైనస్‌గా మారింది. తాజాగా ఈ లోపాన్ని సవరించే పనిలో ఉంది నెక్సాన్‌. బ్యాటరీ సామర్థ్యం పెంచడం వల్ల కారు ధర రూ.40,000ల వరకు పెరగవచ్చని అంచనా. ప్రస్తుతం నెక్సాన్‌ కారు రూ.17 లక్షల నుంచి రూ. 18 లక్షల రేంజ్‌లో లభిస్తోంది

ఢిల్లీ సర్కారు
వాతావరణ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ సర్కారు ఎలక్ట్రిక్‌ కార్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సబ్సిడీలు ప్రకటించింది. ఈ సబ్సిడీ కేటగిరీలోకి టాటా నెక్సాన్‌ కూడా చేర్చింది. అయితే సింగిల్‌ ఛార్జ్‌తో ప్రయాణ దూరం తక్కువగా ఉందంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. ఢిల్లీ సర్కాను నెక్సాన్‌ను సబ్సిడీ నుంచి తొలగించింది. రోజురోజుకి రేంజ్‌పై కంప్లైం‍ట్స్‌ ఎక్కువగా వస్తుండటంతో టాటా దిద్దుబాటు చర్యలకు దిగింది. 
 

చదవండి: జనవరి 1 నుంచి ఖరీదు కానున్న కార్లు, టాటా సహా అన్నీ! కారణం ఇదే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top