ఏపీ ‘స్వచ్ఛ భారత్‌’.. టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ తోడ్పాటు

Tata Motors Finance Aid To Swachh Bharat Mission In AP - Sakshi

విజయవాడ: స్వచ్ఛ భారత్‌ మిషన్‌ను విజయవంతం చేసేందుకు తన వంతు సహాయ, సహకారాలు అందిస్తున్నట్లు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ తెలిపింది. వ్యర్ధాల నిర్వహణ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకునే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటునిస్తున్నామని పేర్కొంది.

ఇందులో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో 792 టాటా ఏస్‌ వాహనాలకు సంబంధించి రూ. 36.62 కోట్ల రుణాలు అందించినట్లు కంపెనీ రీజనల్‌ బిజినెస్‌ హెడ్‌ టి. ప్రభు తెలిపారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆవిష్కరించిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ (సీఎల్‌ఏపీ) కింద వ్యర్ధాల నిర్వహణ కోసం ఈ వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపారు. భారీ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను తమ సిబ్బంది త్వరితగతిన ప్రాసెస్‌ చేసి, రుణాల ప్రక్రియను వేగవంతం చేశారని ఆయన పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top