టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌లో మూడు సంస్థల విలీనం పూర్తి | Tata Consumer Products completes merger of subsidiaries | Sakshi
Sakshi News home page

టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌లో మూడు సంస్థల విలీనం పూర్తి

Sep 2 2024 1:32 AM | Updated on Sep 2 2024 8:56 AM

Tata Consumer Products completes merger of subsidiaries

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌లో (టీసీపీఎల్‌) మూడు అనుబంధ సంస్థల విలీన ప్రక్రియ పూర్తయింది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), ఇతరత్రా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావడంతో దీన్ని పూర్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది.

 విలీనమైన వాటిల్లో టాటా కన్జూమర్‌ సోల్‌ఫుల్, నరిష్ కో బెవరేజెస్, టాటా స్మార్ట్‌ఫుడ్జ్‌ ఉన్నాయి. వ్యాపారాన్ని క్రమబదీ్ధకరించుకునే క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు టీసీపీఎల్‌ తెలిపింది. టీసీపీఎల్‌కు రూ. 15,206 కోట్ల కన్సాలిడేటెడ్‌ టర్నోవరు ఉంది. టీ, కాఫీ, ఉప్పు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు, స్నాక్స్, మినీ మీల్స్‌ లాంటివి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. టాటా టీ, టెట్లీ, టాటా కాఫీ గ్రాండ్‌ తదితర కీలక బెవరేజ్‌ బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement