ఈ కారు భలే ఉంది: కొత్త ఎలక్ట్రిక్ కారుతో టాటా సంచలనం..ప్రత్యర్ధి కంపెనీలకు చుక్కలే!

Tata Concept Curvv Electric Suv Unveil Specifications, Range, Features - Sakshi

TATA Concept Curvv Electric Suv: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రత్యర్ధి ఆటోమొబైల్‌ సంస్థలకు భారీ షాక్‌ ఇస్తూ అదిరిపోయే ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లో ఆవిష్కరించింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కర్వ్‌ (Tata Concept Curvv electric suv) పేరుతో  మార్కెట్‌కు పరిచయమైన కార్‌ డిజైన్‌, ఫీచర్లు ఇటు కొనుగోలు దారుల్ని,అటూ మార్కెట్‌ నిపుణుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుండగా..ఈ కారును అమ్మకాలు జరిపేందుకు మరింత సమయం పట్టనుంది.  

ఇప్పటికే టాటా సంస్థ నుంచి రెండు నెక్సాన్‌ ఈవీ, టైగర్‌ ఈవీతో పాటు 2020లో ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన నెక్ట్స్‌ జనరేషన్‌ టాటా సియెర్రా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయగా.. తాజాగా బుధవారం టాటా మోటార్స్‌ పాసింజర్‌ వెహికల్స్‌ లిమిటెడ్‌ మేనేజిండ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర  ఎలక్ట్రిక్ కర్వ్‌ ఎస్‌యూవీ కారును విడుదల చేశారు. ఇప్పుడు మనం ఈ కారు గురించి మరిన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకుందాం.  

కార్‌ రేంజ్‌ 
కారు విడుదలైన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం.. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కర్వ్‌ కారు రేంజ్‌ ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 400కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.  

ఫ్రేమ్‌ లెస్‌ విండో 


టాటా కర్వ్‌ పై మరో ఫ్యాన్సీ టచ్ ఏంటంటే అన్ని డోర్‌లపై ఫ్రేమ్‌లెస్ విండోస్ రూపంలో వీక్షించవచ్చు.  

సన్‌ రూఫ్‌తో వస్తుంది


ఈ రోజుల్లో చాలా వాహనాల మాదిరిగానే టాటా కర్వ్‌ కూడా పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. ఈ సన్‌ రూఫ్‌ వల్ల లోపల మిరిమిట్లు గొలిపేలా కాంతిని వెదజల్లుతుంది. క్యాబిన్‌ సైతం విశాల అనుభూతిని ఇస్తుంది.

మినిమలిస్టిక్ ఇంటీరియర్‌

టాటా కార్‌ మినిమలిస్టిక్ ఇంటీరియర్‌తో రానుంది. డ్యాష్‌బోర్డ్ పైన రెండు ఫ్లోటింగ్ స్క్రీన్‌లు ఉన్నాయి. అందులో ఒకటి మల్టీ ఇన్ఫర్మేషన్‌ డిస్‌ప్లే (ఎంఐడీ) మరో డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌గా పని చేస్తుంది. స్టీరింగ్ వీల్ ఇరువైపులా బ్యాక్‌లిట్ కంట్రోల్‌తో  ఫ్లాట్ బాటమ్ డిజైన్‌తో వస్తుంది.  

ఛార్జింగ్ ఫీచర్‌ సూపర్‌ 


టాటా మోటార్స్ కర్వ్‌ కాన్సెప్ట్ కారులో వెహికల్-టు-వెహికల్, వెహికల్-టు-లోడ్ ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై కంపెనీ ప్రతినిధులు స్పందించాల్సి ఉండగా.. ఈ కొత్త కాన్సెప్ట్‌తో ఇతర వాహనాలు లేదా చిన్న విద్యుత్ ఉపకరణాలను ఛార్జ్ చేయగలదని దీని అర్థం.

అడ్జెస్టబుల్‌  రెజెనేరేటీవ్ బ్రేకింగ్
టాటా మోటార్ జనరేషన్ 2 పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడల్‌ పెద్ద వెహికల్స్‌ అన్నీ రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో వస్తాయి. రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసే సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 

2025 నాటికి 10కార్లు
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కర్వ్‌ కార్లను 2025 నాటికి మరో 10  ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మూడు వేరియంట్‌ కార్లను విడుదల చేయాలని చూస్తుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్న టాటా ఎలక్ట్రిక్‌ కార్లు! వెహికల్స్‌ డెలివరీలో రికార్డ్‌లు! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top