తెరుచుకున్న ‘తనిష్క్‌’

Tanishq Stores Opened Across India After Lockdown lift Amid Covid 19 Rules - Sakshi

లాక్‌డౌన్‌ తర్వాత తెరుచుకుంటున్న స్టోర్లు

దేశవ్యాప్తంగా 294 స్టోర్లు ప్రారంభం

ముంబై: లాక్‌డౌన్‌ ఎత్తివేత నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా స్టోర్లను తెరిచినట్లు బంగారు ఆభరణాల తయారీ సంస్థ తనిష్క్‌ తెలిపింది. స్టోర్లలోకి పరిమిత సంఖ్యలోనే కస్టమర్లను అనుమతిస్తామని పేర్కొంది. వైరస్, బ్యాక్టీరియాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికత కలిగిన ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌ను స్టోర్లలో ఏర్పాటు చేసినట్లు వివరించింది.

సిబ్బందికి టీకా
సిబ్బంది మొత్తానికి ఉచితంగా టీకాను అందించామని, స్టోర్లలో డబుల్‌ మాస్క్‌ లేదా ఎన్‌95 మాస్కుల ధారణ తప్పనిసరి చేశామని తెలిపింది. టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్‌ అన్‌లాక్‌ ప్రక్రియ తర్వాత దేశవ్యాప్తంగా ఉండే తన 356 స్టోర్లలో 294 రిటైల్‌ స్టోర్లను పునఃప్రారంభించింది.   

చదవండి : SBI: హెల్త్‌కేర్‌ బిజినెస్‌ లోన్‌ ద్వారా ఎంత రుణం పొందవచ్చు ?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top