సుందరం ఏఎంసీ–ప్రిన్సిపల్‌ ఏఎంసీ డీల్‌కు అనుమతి

Sundaram Asset Management gets Sebi nod to buy Principal AMC India - Sakshi

ముంబై: ప్రిన్సిపల్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ భారత్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు సెబీ ఆమోదం లభించినట్టు సుందరం అస్సెట్‌మేనేజ్‌మెంట్‌  కంపెనీ తెలిపింది. ప్రిన్సిపల్‌ ఇండియా నిర్వహణలోని ఆస్తులను 100 శాతం సుందరం ఫైనాన్స్‌ అనుబంధ సంస్థ అయిన సుందరం అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సొంతం చేసుకోనుంది. ఈ ఒప్పం దాన్ని ఈ ఏడాది జనవరి 28న సుందరం ఏఎంసీ ప్రకటించింది.

కొనుగోలుకు ఎంత వెచ్చిస్తున్నదీ వెల్లడించలేదు. ‘‘ప్రస్తుతం ప్రన్సిపల్‌ ఏఎంసీ నిర్వహిస్తున్న మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను సుందరం పథకాల్లో విలీనం చేయడం లేదంటే ఆయా పథకాల పేర్లను సుందరం పేరుమీదకు మార్చొచ్చు. ప్రిన్సిపల్‌ ఏఎంసీ పంపిణీదారులు, ఇన్వెస్టర్లు సుందరం కిందకు వస్తారు’’ అని పేర్కొంది. ఇరు సంస్థల ఉమ్మడి ఆస్తుల విలువ రూ.50,000 కోట్లకు చేరుకుంటుందని సుందరం ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హర్షవిజి తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top