
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:58 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు నష్టపోయి 24,876కు చేరింది. సెన్సెక్స్(Sensex) 233 ప్లాయింట్లు తగ్గి 81,562 వద్ద ట్రేడవుతోంది.




గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.94 శాతం పెరిగింది
మధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. బ్రెంట్ చమురు బ్యారల్ 74 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్ పెరుగుతోంది. విదేశీ మార్కెట్లో ఔన్స్ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)