ఆటుపోట్ల మధ్య స్టాక్‌ మార్కెట్లు.. స్థిరంగా సూచీలు | Stock market updates on June 16, 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: ఆటుపోట్ల మధ్య స్టాక్‌ మార్కెట్లు.. స్థిరంగా సూచీలు

Jun 16 2025 9:59 AM | Updated on Jun 16 2025 10:15 AM

Stock market updates on June 16, 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:52 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు లాభపడి 24,729కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 47 ప్లాయింట్లు పెరిగి 81,164 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.32 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 75.08 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.13 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 1.3 శాతం దిగజారింది.

అనూహ్యంగా ఆర్‌బీఐ రెపో రేటును 0.5 శాతం తగ్గించడంతో తొలుత జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు గత వారం చివర్లో డీలా పడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ భయాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఈ వారం సైతం మార్కెట్లపై ప్రభావం పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

మధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. వారాంతాన బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 78 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్‌ పెరిగింది. విదేశీ మార్కెట్లో ఔన్స్‌ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement