
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు నష్టపోయి 24,906కు చేరింది. సెన్సెక్స్(Sensex) 159 ప్లాయింట్లు దిగజారి 81,593 వద్ద ట్రేడవుతోంది.

యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే బాటలో దేశీ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఈ వారం వాణిజ్య ఒప్పందం కుదిరితే సెంటిమెంటు సానుకూలంగా ప్రభావితమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపే వీలున్నట్లు తెలియజేశారు. వడ్డీ రేట్లపై యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై గత వారం భారత్, యూఎస్ బృందాలు నాలుగు రోజులపాటు వాషింగ్టన్‌లో నిర్వహించిన ఐదో రౌండ్ చర్చలు పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్టు 1కల్లా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)