
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు తగ్గి 25,423కు చేరింది. సెన్సెక్స్(Sensex) 126 ప్లాయింట్లు నష్టపోయి 83,313 వద్ద ట్రేడవుతోంది.

మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే పలు కీలక సంఘటనలు ఈ వారంలో చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్‌పై కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్ గనుక కుదిరితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)