సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Mon, Feb 5 2024 3:48 PM

Stock Market Closing Update By Money Mantra - Sakshi

ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 354.21 పాయింట్ల నష్టంతో 71731.42 వద్ద, నిఫ్టీ 82.10 పాయింట్ల నష్టంతో 21771.70 వద్ద ముగిసాయి. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా నష్టాల్లోనే ముగిసాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా టాటా మోటార్స్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొదలైన కంపెనీలు చేరాయి.

బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్ లిమిటెడ్, భారతి ఎయిర్‌టెల్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీ సిమెంట్స్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement