
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 7.52 పాయింట్లు లేదా 0.010 శాతం నష్టంతో.. 74,332.58 వద్ద, నిఫ్టీ 7.80 పాయింట్లు లేదా 0.035 శాతం లాభంతో 22,552.50 వద్ద నిలిచాయి.
బంకా బయోలూ, సోమి కన్వేయర్ బెల్టింగ్స్, బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్, లక్ష్మీ డెంటల్, కంప్యూకామ్ సాఫ్ట్‌వేర్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరాయి. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, MRO-TEK రియాలిటీ, ఎస్ పీ అప్పారల్స్, గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్, దావణగిరి షుగర్ ఫ్యాక్టరీ వంటివి నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)