లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 23rd October 2025 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Oct 23 2025 3:53 PM | Updated on Oct 23 2025 3:56 PM

Stock Market Closing Update 23rd October 2025

గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 130.05 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 84,556.40 వద్ద, నిఫ్టీ 20.30 పాయింట్లు లేదా 0.078 శాతం లాభంతో 25,888.90 వద్ద నిలిచాయి.

సిక్కో ఇండస్ట్రీస్, కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎఫ్‌సీఎస్‌ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, భగేరియా ఇండస్ట్రీస్, కిటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జీ మీడియా కార్పొరేషన్, గల్లంట్ ఇస్పాట్, యూనిపార్ట్స్ ఇండియా, కృష్ణ ఫోస్చెమ్, ఆశాపుర మినెచెమ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement