
పరిశ్రమల సంఘం ‘ఎల్సినా’ డిమాండ్
కేంద్రం పథకంతో 40 శాతానికి స్థానిక విలువ
న్యూఢిల్లీ: నాన్ సెమీకండక్టర్ ఎల్రక్టానిక్ విడిభాగాల తయారీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పాదక అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం స్థానిక తయారీకి జోన్‌నివ్వనుంది. తుది ఉత్పత్తుల విలువలో స్థానిక తయారీ విలువ 40 శాతానికి పెరుగుతుందని ఎల్రక్టానిక్స్ పరిశ్రమల సంఘం (ఎల్సినా) ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ‘ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం’ (ఈసీఎంఎస్)కు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈసీఎంఎస్ కింద రూ.1.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు రావడం గమనార్హం. రూ.59,000 కోట్ల పెట్టుబడులు రాబట్టుకోవాలని కేంద్రం ఆశించగా, అంతకు రెట్టింపు మేర స్పందన వచి్చంది. మొత్తం 249 కంపెనీలు పెట్టుబడుల ప్రతిపాదనలు సమరి్పంచాయి. కేంద్ర ప్రభుత్వ కమిటీ వీటిని పరిశీలించిన అనంతరం, అర్హత కలిగిన వాటికి ఆమోదం లభించనుంది. ‘‘దేశ ఎల్రక్టానిక్స్ తయారీ వ్యవస్థలో స్థానిక విలువ జోడింపును ప్రస్తుతమున్న 15–20 శాతం నుంచి 35–40 శాతానికి వచ్చే ఐదేళ్లలో పెరిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది’’ అని ఎల్సినా సెక్రటరీ జనరల్ రాజు గోయల్ తెలిపారు.
రూ.10.34 లక్షల కోట్ల తయారీ
తాము రూ.4,56,500 కోట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంటే, రూ.10.34 లక్షల కోట్ల ఉత్పత్తికి సంబంధించిన ప్రతిపాదనలు వచి్చనట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ నెల 2న ప్రకటించడం గమనార్హం. ఇందులో ప్రధానంగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులకు సంబంధించి రూ.16,542 కోట్లు, ఎలక్ట్రో మెకానికల్ విడిభాగాలకు సంబంధించి రూ.14,362 కోట్లు, మల్టీ లేయర్ పీసీబీలకు సంబంధించి రూ.14,150 కోట్లు, డిస్‌ప్లే మాడ్యూల్ సబ్ అసెంబ్లీకి సంబంధించి రూ.8,642 కోట్లు, కెమెరా మాడ్యూల్ సబ్ అసెంబ్లీకి సంబంధించి రూ.6,205 కోట్లు, లిథియం అయాన్ సెల్స్‌కు సంబంధించి రూ.4,516 కోట్ల చొప్పున ప్రతిపాదనలు వచ్చాయి.
ఇందులో ఎలక్ట్రో మెకానికల్స్, ఐటీ ఉత్పత్తులకు సంబంధించి ఎన్‌క్లోజర్లు, మల్టీ లేయర్ పీసీబీలు, ఫ్లెక్సిబుల్ పీసీబీలకు ంసబంధించి పెద్ద మొత్తంలో, అధిక విలువ మేర ప్రతిపాదనలు వచి్చనట్టు ఎల్‌సినా తెలిపింది. తయారీ కేంద్రంగా భారత్‌పై పెరుగుతున్న విశ్వాసానికి ఈ స్పందన నిదర్శనమని ఎల్సినా ప్రెసిడెంట్ శశి గంధనం పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులను కల్పించడం ద్వారా ఈ ధోరణికి రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రాలు సైతం తమవంతు ప్రోత్సాహకాలు కల్పిస్తే మరిన్ని పెట్టుబడులు రావడంతోపాటు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పన సాధ్యపడుతుందన్నారు.