ఎస్‌బీఐ మొండి బకాయిలు అన్ని కోట్లా? షాకింగ్‌ విషయాలు

State Bank of India bad loans shocking details - Sakshi

ఎస్‌బీఐ మొండి బకాయిలు రూ.1,71,953 కోట్లు

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అందించిన రుణాల్లో 1,71,953 కోట్ల రూపాయలకు పైగా మొండి బకాయిలు ఉన్నాయని యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ ఫౌండర్‌ రాజేంద్ర పల్నాటి తెలిపారు. 

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేయని మొండి బకాయిలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, పారిశ్రామికవేత్తలు రుణాలను తీసుకొని తిరిగి చెల్లించని అప్పులు ఎన్ని ఉన్నాయనే సమాచారాన్ని భారత రిజర్వ్‌ బ్యాంకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుని తెలుసుకున్న రాజేంద్ర పల్నాటి  ఆ వివరాలను బయట పెట్టారు.  వీటితో పాటుగా పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపారాల కోసం నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)లో భాగంగా అప్పుగా ఇచ్చిన లోన్లు 1,06,804 కోట్ల రూపాయలు ఇంకా తిరిగి రాలేదని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ పీఐఓ ములుకుంట్ల శ్రీనివాస్‌ రావు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top