స్టార్ క్రికెటర్‌ కొత్త సూపర్‌ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు! | Sakshi
Sakshi News home page

స్టార్ క్రికెటర్‌ కొత్త సూపర్‌ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు!

Published Thu, Jun 22 2023 2:48 PM

Star Cricketer Shikhar Dhawan buys super expensive Range Rove shares video - Sakshi

స్టార్ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌కు లగ్జరీ కార్లపైమోజును మరోసారి  చాటుకున్నాడు. తాజాగా అత్యంత ఖరీదైన రేంజ్‌ రోవర్‌ ఆటోబయోగ్రఫీ కారును కొనుగోలు చేశాడు.దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ధావన్‌ ఒక వీడియను షేర్‌ చేశాడు. దీంతో ఫ్యాన్స్‌ 4 లక్షల,11 వేలకు పైగా లైక్స్‌తో తెగ  ఎంజాయ్‌ చేస్తున్నారు.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడళ్ల ధర రూ. 3.5 కోట్ల నుండి అత్యంత ఖరీదైన వేరియంట్‌ రూ. 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ధావన్‌ కొనుగోలు చేసిన లేటెస్ట్‌ వెర్షన్ విలువ 4 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఎప్పటిలాగానే తనదైన స్టయిల్‌లో పంజాబీ పాటతో  ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు.  సెలబ్రిటీలు మనసుపడుతున్న కార్లలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా ఒకటి. 

ఫీచర్లు పరివీలిస్తే ఫ్లోటింగ్-స్టైల్, పూర్తిగా డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, మెరిడియన్ 35-స్పీకర్ ఆడియో సిస్టమ్,  డైనమిక్ నోయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది. ఇది వీల్ వైబ్రేషన్‌లు, ఇంజిన్ నానోయిస్, టైర్ నోయిస్, రోడ్ నోయిస్ ఇతర బ్యాక్‌గ్రౌండ్ నోయిస్‌ కంట్రోల్‌ చేస్తుంది. భారీ 13.1అంగుళాల స్క్రీన్‌, హెడ్-అప్ డిస్‌ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ , బ్యాక్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. ఇంకా హెడ్‌ల్యాంప్ ప్రొజెక్టర్‌ ఎల్‌ఈడీ లైట్లు , ఇంటిగ్రేటెడ్‌ LED DRL ఉంటాయి. ప్రీమియం లుక్‌తో రీడిజైన్‌ చేయబడిన బంపర్‌తోపాటు అప్‌గ్రేడెడ్‌  డోర్‌ హ్యాండిల్స్‌ ఫ్లష్‌ ఫిట్టింగ్‌ను కలిగి  ఉందీ కారు.

 కాగా ఐపీఎల్‌ పంజాబ్ కింగ్స్  జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌ శిఖర్ ధావన్‌కు  లగ్జరీ కార్లంటే మక్కువ  ఎక్కువ. ఇప్పటికే అతని గ్యారేజ్‌లోమెర్సిడెస్-బెంజ్ GL-క్లాస్ BMW M8ని  కొనుగోలు చేశాడు. ఈ లిస్ట్‌లో తాజాగా ల్యాండ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ చేరడం విశేషం.
 

Advertisement
 
Advertisement