విజయవంతమైన స్టార్ షిప్ పరీక్ష, కానీ?

SpaceX Starship Rocket Prototype Nails Landing, Then Blows Up - Sakshi

స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ‘సీరియల్ నెం.10’ (ఎస్ ఎన్ 10) రాకెట్ విజయవంతంగా భూమిపై దిగినప్పటికీ తర్వాత మంటలు మండుతూ లాంచ్ పాడ్(భూమి)పై పడిపోయింది. ప్రయోగించిన 4 నిమిషాలకు ఆరు మైళ్ళ ఎత్తుకు చేరుకున్న తర్వాత మూడు రాప్టర్ ఇంజిన్‌లను ఆపివేశారు. కిందకు వస్తున్న క్రమంలో మళ్లీ రాప్టర్ ఇంజిన్‌లను మండించారు. అయితే, కిందకు విజయవంతగా దిగిన తర్వాత రాకెట్ లో మంటలు  మండుతూ భూమిపై పడిపోయింది. నిజానికి ఈ ప్రయోగం సక్సెస్ అయిందని ఈ సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ పేర్కొన్నారు. 

ఇది వరకి ప్రయోగించిన ఎస్ఎన్ 8, 9 వంటి ప్రోటోటైప్ రాకెట్ల మాదిరిగా ఇది పేలి పోలేదని ఆయన అన్నారు. లాండింగ్ పాడ్ పై ఈ రాకెట్ విజయవంతంగా తాకిందని ఇది బ్యూటిఫుల్ టెస్ట్ ఫ్లైట్ ఆఫ్ సార్ షిప్ అని ఆయన తెలిపారు. కాగా ఈ పేలుడుకి కారణం తెలియలేదు. బేస్ లో ఎటాచ్ అయిన లాండింగ్ లెడ్స్ తెరచుకోలేదని తెలుస్తుంది. టెక్సాస్ లోని బోకా చికా నుంచి బుధవరం సాయంత్రం 5:15 గంటలకు ఈ రాకెట్ ని ప్రయోగించారు. ఇది మూడవ హై-ఎలిట్యూడ్ పరీక్ష.

స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్ ద్వారా భవిష్యత్ లో వ్యోమగాములను చంద్రుడు, అంగారకునిపైకి పంపాలని ఎలన్ మస్క్ యోచిస్తున్నారు. తాజా పరిణామంపై ఆయన స్పందిస్తూ తమ బృందం అద్భుతంగా పనిచేసిందని పేర్కొన్నారు. ఏదో ఒక రోజున స్టార్ షిప్ ఫ్లైట్స్ సాధారణమే పోతాయని ఆయన అంటున్నారు. ఇప్పటికే తన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ నమూనాలను ఆయన హాలీవుడ్ చిత్రాల్లో వినియోగించిన ప్రోటోటైప్ ఇమేజీలతో పోలుస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top