అదిరిపోయే టార్గెట్‌ సెట్‌ చేసుకున్న టీసీఎస్‌

Software company TCS Targeted 50 Billion Turnover By 2030 - Sakshi

టీసీఎస్‌ టార్గెట్‌ 50 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్‌ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించింది. తద్వారా కస్టమర్లకు మరింత చేరువగా బిజినెస్‌ విభాగాలను తీసుకెళ్లాలని భావిస్తోంది. అంతేకాకుండా 2030కల్లా 50 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 3.89 లక్షల కోట్లు) ఆదాయాన్ని అందుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

2021లో టీసీఎస్‌ 25 బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ను సాధించింది. టీసీఎస్‌ ప్రస్తుతం మరో 25 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని జత చేసుకునే దీర్ఘకాలిక వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఇందుకు వ్యవస్థాగత పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత ఇండస్ట్రీ వర్టికల్‌ యూనిట్స్‌ అండ్‌ మార్కెట్స్‌ నిర్మాణాన్ని రెండు గ్రూపులుగా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కంపెనీ అంతర్గత ప్రణాళికలు, వ్యూహాలపై వ్యాఖ్యానించబోమని కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు!  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top