బంగారం రుణాల్లోకి షావోమీ !

SmartPhone Giant Xiaomi Ready To Enter Into Gold debts - Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తాజాగా భారత్‌లో మరిన్ని విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. బంగారంపై రుణాలు, బీమా పాలసీలు, క్రెడిట్‌ లైన్‌ కార్డులు మొదలైన ఆర్థిక సేవలను పూర్తి స్థాయిలో అందించడంపై దృష్టి పెడుతోంది. యాక్సిస్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, స్టాష్‌ఫిన్, మనీ వ్యూ, ఎర్లీ శాలరీ, క్రెడిట్‌ విద్య వంటి దేశీ సంస్థలతో కలిసి ఈ సర్వీసులు అందించనున్నట్లు షావోమీ భారత విభాగం హెడ్‌ మను జైన్‌ వెల్లడించారు.

వచ్చే కొన్ని వారాల్లో బంగారంపై రుణాలను ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. రుణాలకు సంబంధించిన ’మి క్రెడిట్‌’ విభాగం ఇకపై 60 నెలల దాకా కాలావధితో రూ. 25 లక్షల దాకా (ఇప్పటిదాకా  ఇది రూ. 1 లక్షకే పరిమితం) రుణాలను జారీ చేయనున్నట్లు జైన్‌ చెప్పారు.  

చదవండి: ఎస్‌బీఐ లైఫ్‌ నుంచి ఈషీల్డ్‌ నెక్ట్స్‌ పాలసీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top