ఈ స్కోడా కారుపై రూ.8 లక్షల వరకు డిస్కౌంట్​

Skoda Octavia RS 245 available with RS 8 Lakh discount - Sakshi

ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ సంస్థ స్కోడా గతేడాది జరిగిన 2020 ఆటో ఎక్స్​పోలో ఆక్టేవియా ఆర్ ఎస్245 పెర్ఫార్మెన్స్​ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రారంభంలో కేవలం 200 యూనిట్లను మాత్రమే భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. అయితే, కరోనా కారణంగా ఈ కార్ల ఆర్డర్లు రద్దయ్యాయి. దీంతో, ఇవి ఆయా డీలర్​షిప్​ సెంటర్లలోనే మిగిలిపోయాయి. ఈ స్టాక్​ క్లియర్​ చేసుకునేందుకు ఇప్పుడు భారీ ఆఫర్​ను ప్రకటించింది స్కోడా కంపెనీ. ఆక్టేవియా ఆర్‌ఎస్‌ 245 వేరియంట్​పై రూ.8 లక్షల వరకు డిస్కౌంట్​ను ప్రకటించింది.

ఆక్టేవియా ఆర్‌ఎస్‌245ను గత ఏడాది రూ.35.99 లక్షల(ఎక్స్-షోరూమ్) కు లాంచ్ చేసింది. ఈ కారు 2.0-లీటర్, టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 370ఎన్‌ఎమ్ వద్ద 245 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డిఎస్జి డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్తో జత చేయబడింది. కొత్త వేరియంట్​లో డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్, ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్​ లిమిటెడ్​ స్లిప్ డిఫరెన్షియల్​ని వంటి ఫీచర్లను కూడా అందించింది. దీనిలోని ట్రాక్షన్‌ ముందు చక్రాలకు 100 శాతం శక్తిని ప్రసారం చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. తర్వాత తరం ఆక్టేవియా కార్లను తీసుకోని రావడానికి మిగిలిపోయిన ఆర్‌ఎస్‌ 245 వేరియంట్​పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది.

చదవండి: భారీగా పెరిగిన బంగారం ధరలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top