Showreel: ఇంటర్వ్యూలకు రెజ్యూమ్‌లు అవసరం లేదు, టిక్‌టాక్‌ తరహాలో వీడియోలు చాలు

Showreel Find Jobs Through Tiktok Video Resume Platform - Sakshi

కాలం మారింది గురూ. ఇకపై పేజీలకు పేజీలు రెజ్యూమ్‌లు చేతపట్టుకొని కంపెనీల చుట్టూ తిరిగే అభ్యర్థులు ఒకవైపు. నియామకాల్లో ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం, సర్టిఫికెట్స్‌ ధ్రువీకరణ కోసం కంపెనీలు మరోవైపు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా టిక్‌ టాక్‌ తరహాలో వీడియోలు చేసి..ఇంటర్వ్యూలకు అటెండ్‌ అవ్వొచ్చు.

  

సబీర్ భాటియా-  జాక్ స్మిత్లు 1996లో తొలిసారి ఫ్రీ వెబ్‌ ఆధారిత ఇమెయిల్ సర్వీస్‌ 'హాట్‌మెయిల్'ని బిల్డ్‌ చేశారు. ఏడాది వ్యవధిలోనే హాట్‌ మెయిల్‌ను మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసింది. కాల క్రమేణా ఆ హాట్‌ మెయిల్‌ కాస్తా విండోస్‌ లైవ్‌ హాట్‌ మెయిల్‌, ఔట్‌లుక్‌ గా యుజర్లకు పరిచయం అయ్యింది. ఇప్పుడు హాట్‌ మెయిల్‌ సృష్టికర్త సబీర్‌ భాటియా షోరీల్‌ను అనే సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉన్నా ఈ యాప్‌ ..త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ షోరీల్‌ యాప్‌.. టిక్‌ టాక్‌ తరహాలో ఉండే సోషల్‌ మీడియా యాప్‌. టిక్‌ టాక్‌ను ఎంటర్‌ టైన్మెంట్‌ కోసం వినియోగిస్తే.. షో రీల్‌ను ఉద్యోగాలు దక్కించుకునేందుకు ఉపయోగపడుతుంది. 

షో రీల్‌ ఎలా పని చేస్తుంది..? 
మీరు ఏదైనా సంస్థలో జరిగే ఇంటర్వ్యూలో అటెండ్‌ అవ్వాలంటే టిక్‌ టాక్‌ తరహాలో షార్ట్‌ వీడియోని తయారు చేయాలి. ఆ వీడియో సైతం క్యూ అండ్‌ ఏ (question and answer) తరహాలో ఉండాలి. మీరు ఏ జాబ్‌ రోల్‌కి ఇంటర్వ్యూకి అటెండ్‌ అవుతున్నారో  అందుకు సంబంధించిన ప్రశ్నలు షో రోల్‌ యాప్‌లో ముందుగా ఉంటాయి. ఆ యాప్‌లో లాగిన్‌ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్‌ అయ్యే కంపెనీని సెలక్ట్‌ చేసుకోవాలి. సెలక్ట్‌ చేసుకుంటే సదరు సంస్థ మీ జాబ్‌ ప్రొఫైల్‌కు తగ్గట్లు ప్రశ్నల్ని సిద్ధం చేస్తుంది. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా వీడియో ఫార్మాట్‌లో ఉంటుంది. ఆ వీడియోలన్నీ రికార్డ్‌ అవుతాయి. అలా రికార్డ్‌ చేసిన వీడియోలు.. టిక్‌ టాక్‌ వీడియోల్ని ఎలా స్వైప్‌ చేసి చూస్తామో..అలాగే వేరే వాళ్లు ఇంటర్వ్యూకు అటెండ్‌ అయిన వీడియోల్ని వీక్షించవచ్చు. మీరు ఈ వీడియోలను మీరు పని చేయాలనుకుంటున్న కంపెనీలతో అటాచ్‌ చేయొచ్చు.  మీ షోరీల్ వీడియోకు నేరుగా లింక్ చేసి మీ రెజ్యూమ్‌కి క్యూఆర్‌ కోడ్‌ను యాడ్‌ చేయవచ్చు.  

షోరీల్‌లో సంస్థలు అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేసుకుంటాయ్‌? 
షోరీల్‌ లో అటు సంస్థలు, ఇటు జాబ్‌ కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధుల ప్రొఫైల్స్‌ ఉంటాయి. షోరీల్‌ లో జాబ్‌ కేటగిరి ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా మీకు ఎలాంటి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నారో..అందుకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. కంపెనీలు నేరుగా ఆ విభాగంలో ప్రశ్నలను పోస్ట్ చేస్తాయి. మీరు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.  

వీడియోలతో ఇంటర్వ్యూ సాధ్యమేనా?
షో రోల్‌ సంస్థ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడమే ప్రధాన లక్ష‍్యమని ఆ సంస్థ ఫౌండర్‌ సబీర్ భాటియా తెలిపారు. వీడియో రెజ్యూమ్‌ల ద్వారా ఇంటర్వ్యూ ప్రాసెస్‌ వేగవంతం అవుతుందన్నారు. అయితే వీడియో ఇంటర్వ్యూల తీరుతెన్నుపై అనేక అనుమానాలు వ్యక్తమవ్వడంపై సబీర్‌ మాట్లాడుతూ..అభ్యర్ధుల ఎంపిక విషయం పక్షపాతం ఉండే అవకాశం ఉందని, అందుకే అభ్యర్ధులు వారి ముఖాన్ని చూపించాల్సిన అవసరం లేదన్నారు. అవతార్‌ ఆకారాల్ని క్రియేట్‌ చేస్తామని చెప్పారు. కేవలం ఆడియో రికార్డింగ్‌ చేయొచ్చని తెలిపారు.

చదవండి: టీసీఎస్‌ రూల్స్‌ మార్చేసింది.. అవి ఏంటంటే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top