మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ భద్రమేనా..ఇలా చేస్తే బెటర్‌..!

Seven Steps To Secure Your Facebook Account - Sakshi

ఇంటర్నెట్‌ యుగంలో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ లేని వారు చాలా అరుదు. ఇతరులతో ఫేస్‌బుక్‌  మమేకమవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. భారత్‌లో ఫేస్‌బుక్‌ అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, మనలో చాలా మంది ఫేస్‌బుక్‌లో  కాలక్షేపం చేస్తూ అందులో మునిగితేలుతాము. కాగా ప్రస్తుతం హాకర్లు ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంలో యూజర్ల ఖాతాలనుంచి విలువైన సమాచారాన్ని పొందడానికి అనేక పద్దతులను వాడుతున్నారు. మన ఫేస్‌బుక్‌ ఖాతాలు హాకర్ల బారినుంచి తప్పించుకోవడానికి ఫేస్‌బుక్‌లో ఉండే సెట్టింగ్‌లతో హాకింగ్‌కు గురికాకుండా చూసుకోవచ్చును.
 

మీ ఫేస్‌బుక్‌ ఖాతాను ఇలా భద్రపర్చుకోండి...

స్టెప్‌ 1: ముందుగా మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వండి. లాగిన్‌ అయిన తరువాత కుడివైపు ఉన్న మూడు గీతలపై క్లిక్‌ చేయండి. తరువాత సెట్టింగ్స్‌ అండ్‌ ప్రైవసీపై క్లిక్‌ చేయండి.

స్టెప్‌ 2: మెను బార్‌ నుంచి ‘సెక్యూరిటీ అండ్‌ లాగిన్‌’పై క్లిక్‌ చేయండి.

స్టెప్‌ 3: అందులో ‘వేర్‌ యూఆర్‌ లాగ్డ్‌ ఇన్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. ఈ సెట్టింగ్‌ మీరు ఫేస్‌బుక్‌లో లాగిన్‌ అయిన సెషన్లను చూపిస్తోంది. అందులో  మీరు గుర్తించని లాగిన్‌ సెషన్‌లు ఏమైనా ఉంటే, త్రీ-డాట్ మెనుపై క్లిక్ చేసి, ‘లాగ్ అవుట్’ను ఎంచుకోవడం ద్వారా వెంటనే సంబంధిత సెషన్ నుండి లాగ్ అవుట్ అవ్వండి. ఒకవేళ మీరు అన్ని సెషన్ల నుంచి ఒకేసారి లాగ్‌అవుట్‌ అయ్యే అప్షన్‌ కూడా ఉంటుంది.

స్టెప్‌ 4: తరువాత, ‘లాగిన్’ ఆప్షన్‌ కింద ఉన్న , ‘సేవ్‌ యూవర్‌ లాగిన్‌ ఇన్ఫర్మేషన్‌’ పై క్లిక్‌ చేయం‍డి. ఇలా చేయడంతో మీరు లాగిన్‌ సమాచారం సేవ్‌ అవుతుంది. ఇది కేవలం మీరు మీ పర్సనల్‌ కంప్యూటర్‌ ఐతేనే ఇలా చేయాలి.

స్టెప్‌ 5: సెట్టింగ్‌ మెనులో ఉన్న ‘టూ ఫ్యాక్టర్‌ అథనిటికేషన్‌( 2FA)’పై క్లిక్‌ చేసిన తరువాత ‘యూజ్‌ టూ ఫ్యాక్టర్‌ అథనిటికేషన్‌’ పై ఎడిట్‌ అప్షన్‌ను క్లిక్‌ చేయాలి. అథనిటికేటర్‌ యాప్‌తో లాగిన్‌ కోడ్‌ను జనరేట్‌ చేయవచ్చును. లేదా ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా కూడా లాగిన్‌ అవ్వచ్చును.  ఈ ప్రాసెస్‌లో వచ్చిన బ్యాక్‌ఆప్‌ కోడ్స్‌ను మర్చిపోకూడదు. ఇలా చేయడంతో మీరు ఎక్కడైనా లాగిన్‌ కావాల్సిఉంటే 2FA ద్వారా లాగిన్‌ అవాల్సి ఉంటుంది. ముందుగా మీ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసిన తరువాత మీరు రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. లాగిన్‌ అయ్యే సమయంలో ఆరు అంకెల ఓటీపీ ఎంటర్‌ చేసిన తరువాతనే మీ అకౌంట్‌ మీ ముందు ప్రత్యక్షమైతుంది.

స్టెప్‌ 6: ‘సెట్టింగ్‌ ఆప్‌ ఎక్సట్రా సెక్యూరిటీ’ అప్షన్‌ మీద క్లిక్‌ చేసి,  లాగిన్‌ అలర్ట్‌ సెట్టింగ్‌ను అన్‌ చేయాలి. ఇది లాగిన్‌ అలర్ట్‌ ను అందిస్తోంది. ఒకవేళ మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి వేరే మొబైల్‌ నుంచి లాగిన్‌ అయితే వెంటనే గుర్తించి మీకు ఈ-మెయిల్‌ లేదా ఫేస్‌బుక్‌ మెసేంజర్‌కు మెసేజ్‌ను పంపి హెచ్చరిస్తుంది.

స్టెప్‌ 7: చివరగా, ‘సెట్టింగ్‌ ఆప్‌ ఎక్సట్రా సెక్యూరిటీ’ ఆప్షన్‌లో భాగంగా ఫేస్‌బుక్‌లోని మీ ముగ్గురు నుంచి ఐదు స్నేహితులను ఎంచుకోండి. దీంతో  మీరు ఎప్పుడైనా మీ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతే వారి అకౌంట్లనుపయోగించి లాగిన్‌ అవ్వచ్చును.

చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు కొత్త బెడద..! వారికి మాత్రం పండగే...

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top