stockmarkets: నష్టాలకు చెక్: వారాంతంలో లాభాలు

15700 ఎగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో ఉత్సాహంగా ముగిసాయి. ఆరంభంలోనే నష్టాలో ప్రారంభమైనా మిడ్ సెషన్‌నుంచి పుంజుకుంది. సెన్సెక్స్ 166 పాయింట్లు పెరిగి 52,485 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 42 పాయింట్లు లాభంతో 15,722 వద్ద ముగిసింది. డే కనిష్టంనుంచి 350 పాయింట్లు ఎగిసింది.నిఫ్టీ 15700 స్థాయికి ఎగువన ముగిసింది. తద్వారా గత నాలుగు సెషన్ల నష్టాలకు చెక్ పెట్టింది.
ఫార్మా ఇండెక్స్ ఎక్కువగా లాభపడగా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ, మీడియా సూచీలు కూడాలాభపడ్డాయి. మరోవైపు, కొన్ని మెటల్, ఎఫ్‌ఎంసిజి, పీఎస్‌యూ షేర్లలో స్వల్పంగా నష్టాలు కనిపించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, కోల్ ఇండియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, యూపీఎల్, ఇండియన్ ఆయిల్ లాభపడగా, టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్, హిందాల్కో, బజాజ్ ఆటో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్ నష్టపోయాయి.