నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు..!

Sensex Slips 483 Points Nifty Settles Below 17700 It Stocks Drag - Sakshi

భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్స్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు సోమవారం రోజున నష్టాలతో ముగిశాయి. ఐటీ స్టాక్స్‌తో సూచీలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు  ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి అడుగులు వేశారు. 

బీఎస్‌ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు లేదా 0.81 శాతం పతనమై 58,965 వద్ద ముగిసింది.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 109 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 17,675 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.62 శాతం పెరగగా...స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ 0.06 శాతం క్షీణించడంతో మిడ్ అండ్‌ స్మాల్ క్యాప్ షేర్లు మిశ్రమ ఫలితాలను పొందాయి.

ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్‌టిపిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, టిసిఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా,సన్ ఫార్మా లాభాలను గడించాయి.  ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌సీఎల్‌,  ఇన్ఫోసిస్, విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ  ట్విన్స్,  యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్‌ భారీ నష్టాల్లో మూటగట్టుకున్నాయి.  గత వారం హెచ్‌డీఎఫ్‌సీ మెగా-విలీనాన్ని ప్రకటించన తదుపరి రోజు నుంచిహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ వరుసగా ఐదు సెషన్లలో భారీ నష్టాలను పొందాయి. విలీన ప్రకటన తరువాత వచ్చిన లాభాలు మొత్తం నీరుగారిపోయాయి.  నిఫ్టీలో హెచ్‌సిఎల్ టెక్ టాప్ లూజర్‌గా నిలిచింది. 

చదవండి: షాకింగ్‌ నిర్ణయం..! యూపీఐ పేమెంట్స్‌తో వాటిని కొనలేరు...! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top